తల్లికి అన్నం పెట్టనోడు పిన్నికి బంగారు నెక్లెస్ అంట.!కేసీఆర్ వ్యవహారం ఇట్లుందన్న కాంగ్రెస్.!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వైఖరిపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. తెలంగాణ రైతాంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే పట్టించుకోని చంద్రశేఖర్ రావు పంజాబ్ రాష్ట్రంలోని రైతాంగానికి ఆర్థిక సాయం చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. కల్లాల్లో ఉన్న ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోవడమే కాకుండా వరద నీటిలో తిండిగింజలు కొట్టుకుపోతున్నా పట్టించుకున్న దిక్కులేదుకు గానీ ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పడానికి సిగ్గుపడాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు.

ఢిల్లీ రైతుల సంగతి కేంద్రం చూసుకుంటుంది.. కేసీఆర్ తెలంగాణ రైతుల సంగతి చూడాలన్న కాంగ్రెస్

ఢిల్లీ రైతుల సంగతి కేంద్రం చూసుకుంటుంది.. కేసీఆర్ తెలంగాణ రైతుల సంగతి చూడాలన్న కాంగ్రెస్

తెలంగాణ ముఖమంత్రి చంద్రశేఖర్ రావు వ్యవహారం మాటల నవాబు, చేతలు గరీబు అన్నట్లుగా ఉంటుందని, రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం అని గొప్పలు చెప్పుకోవడమే గానీ క్షేత్ర స్థాయిలో ఒక్క పరికొచ్చే పని కూడా చేయరని చంద్రశేఖర్ రావు మీద దుమ్మత్తి పోసారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాం సేకరణకు అవసరమైన కనీస సదుపాయాలు ఏర్పాటు చేయడంలో చంద్రశేఖర్ రావు పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడే టార్పాలిన్లు, ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి, శుభ్రం చేసే యంత్రాలు లేక అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని మధు యాష్కి ఆవేదన వ్యక్తం చేసారు.

తెలంగాణ రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు.. ఏ మాత్రం చలించని కేసీఆర్ అంటున్న మధు యాష్కి

తెలంగాణ రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు.. ఏ మాత్రం చలించని కేసీఆర్ అంటున్న మధు యాష్కి

వానాకాలం వ్యవసాయంలో భాగంగా 61.30 లక్షల ఎకరాల్లో వరి సాగైందని అంచనాలున్నాయని, అందుకు అనుగుణంగా ముందస్తు సౌకర్యాలు కల్పించడంలో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, చంద్రశేఖర్ రావుకు కుట్ర రాజకీయాలు చేయడంపైనున్న దృష్టి రైతులమీద లేనేలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. పొరుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు రైతుల నుంచి ధాన్యం సేకరించి, విదేశాలకు ఎగుమతులు చేస్తుండగా, చంద్రశేఖర్ రావు మాత్రం బైరూపు వేషాలేస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడని మధు యాష్కి ఫైర్ అయ్యారు.

ఢిల్లీ రైతులకు 3లక్షలు తర్వాత.. మరి ఇక్కడ రైతుల సంగతేంటి..?నిలదీసిన కాంగ్రెస్

ఢిల్లీ రైతులకు 3లక్షలు తర్వాత.. మరి ఇక్కడ రైతుల సంగతేంటి..?నిలదీసిన కాంగ్రెస్

ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి మూడు లక్షల రూపాయలు ఇస్తానన్న చంద్రశేఖర్ రావు, ముందుగా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ మధ్య వరి ధాన్యం కుప్పలపై ప్రాణాలు వదిలిన రైతులకు పరిహారం ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలకు, కొండగట్టులో చనిపోయిన వారికి, యువ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిర్వాకంతో ఆత్మహత్యలు చేసుకున్న 27మంది ఇంటర్ విద్యార్థులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మధే యాష్కి డిమాండ్ చేసారు.

అనేక సంక్షేమ పథకాలు ప్రశ్నార్థంగా మారియి.. ఆదుకునేదెవ్వరని ప్రశ్నించిన కాంగ్రెస్

అనేక సంక్షేమ పథకాలు ప్రశ్నార్థంగా మారియి.. ఆదుకునేదెవ్వరని ప్రశ్నించిన కాంగ్రెస్

అంతే కాకుండా కొత్త వృద్ధాప్య పెన్ష‌న్లు అమలు చేయడంలో చంద్రశేఖర్ రావు సర్కార్ నిర్లక్ష్యం నిజమైన లబ్దిదారుల పాలిట శాపంగా మారుతోందని, చంద్రశేఖర్ రావు రెండో సారి అధికారంలోకి వచ్చాక ఆసరా పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 57కు తగ్గించిన తరువాత, కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వలేదనది ఆవేదన వ్యక్తం చేసారు. అర్హత వయసు తగ్గించాక రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 7 లక్షల 80 వేల దరఖాస్తుల పరిశీలనే ఇప్పటి వరకూ చంద్రశేఖర్ రావు సర్కార్ చేయలేదు, దీనిని నిర్లక్ష్యం అనాలా? చేతకాని తనం అనాలా? వయసు పైబడిన వాళ్లంటే చిన్నచూపు అనుకోవాలా? అర్థం కావడంలేని మధు యాష్కి మండి పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+