డ్రగ్స్ కేసు: ఆ పేర్లను బయటపెట్టాలి, శిక్షించాలి: ఎమ్మెల్సీ పొంగులేటి

డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారి పేర్లను బయటపెట్టాలని ఆయన కోరారు.

హైదరాబాద్: డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారి పేర్లను బయటపెట్టాలని ఆయన కోరారు.
డ్రగ్స్ వాడేవాళ్ళను బాధితులుగా చూస్తామని సిఎం కెసిఆర్ చెప్పడం సరికాదన్నారు. ఒక అగ్రనటుడు కూడ ఈ కేసుతో సంబంధం ఉందని సోషల్ మీడియాలో వస్తోంది.

congress demands to reveal all names in drugs case

డ్రగ్స్ వాడినా అమ్మినా అందరూ దోషులేనన్నారు. సినిమా వారిని బాధితులుగా చూడాలని సీఎం అనడం కేసును నీరుగార్చడమేనన్నారు.

ఒళ్ళు బలిసి పార్టీలు చేసుకొంటున్న వారిని బాధితులా అని ఆయన ప్రశ్నించారు. టెర్రరిజం ఎలాగో డ్రగ్ మాపియాను కూడ చూడాలన్నారు. చివరకు పోలీసు అధికారులను బెదిరించే స్థాయికి మాఫియా ఎదిగిందన్నారు.

డ్రగ్స్ తో సంబంధం ఉన్న సంస్థల పేర్లతో పాటు, దాన్ని విక్రయించే వారి పేర్లను, డ్రగ్స్ వాడే వారి పేర్లను బహిర్గతం చేయాలని కోరారు. దిగ్విజయ్ సింగ్‌ను ఇంచార్జీ స్థానం నుండి మార్పు చేయడం పార్టీ అంతర్గత వ్యవహరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+