బీఆర్ఎస్‌తో పొత్తుపై తేల్చేసిన ఖర్గే- కాంగ్రెస్ రామబాణం ఇదే

హైదరాబాద్/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.

అటు కాంగ్రెస్ పార్టీ జూలు విదిలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించేలా వ్యూహాలపై కసరత్తు సాగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో చేరికలకూ అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

వరుసగా రెండో రోజు కూడా కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాల కమిటీ భేటీ అయింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సహా కొందరు సీనియర్లు ఇందులో పాల్గొన్నారు. దేశ రాజధానిలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది.

 mallikarjunkharge

కాంగ్రెస్‌లో చేరికలపై దృష్టి సారించాల్సి ఉంటుందని, దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీల్లో ఇమడలేకపోతున్న నాయకులను గుర్తించి కాంగ్రెస్‌లో చేరేలా తక్షణ చర్యలను తీసుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్‌, బీజేపీకి చెందిన కొందరు శాసన సభ్యులు కూడా తమతో టచ్‌లో ఉన్నారంటూ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

పొత్తుల విషయంపైనా చర్చించారిందులో. ఏ పార్టీతో కూడా పొత్తు ఉండబోదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేసినట్లు సమాచారం. వైఎస్ షర్మిల్ సారథ్యంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ- కాంగ్రెస్‌‌తో పొత్తు కోసం ప్రయత్నాలు సాగిస్తోందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో దీన్ని కూడా ఆయన తోసిపుచ్చినట్లు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తోన్న నేపథ్యంలో- కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకోవచ్చనే విషయాన్నీ ఖర్గే కొట్టి పారేసినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్-బీజేపీ రెండూ ఒక్కటేననే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఖర్గే తెలంగాణ నేతలకు సూచించారని అంటున్నారు. జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల తరువాత ఈ రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందాలు కుదిరాయనే విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలంటూ ఖర్గే.. తెలంగాణ క్యాడర్‌కు సూచించగా.. ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+