అల్లు అర్జున్ బాటలో కాంగ్రెస్ మంత్రి షాకింగ్ వ్యాఖ్య.. సీఎం రేవంత్ రెడ్డికి పెద్దకష్టమే!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద కష్టమే వచ్చి పడింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూకుడు చూపించాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డికి అడుగడుగునా ఆయన పేరు మర్చిపోవడం అశనిపాతంగా మారింది.
సీఎం పేరు మర్చిపోవటంపై సోషల్ మీడియాలో చర్చ
మొన్నటికి మొన్న పుష్ప టూ సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోగా, ఇటీవల జగ్గారెడ్డి, తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పేరు ప్రముఖులు మర్చిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణంగా మారింది.

అల్లు అర్జున్ తో మొదలైన రచ్చ
మొన్నటికి మొన్న పుష్ప టు ఈవెంట్లో అల్లు అర్జున్ సీఎం పేరును మర్చిపోయినప్పటి నుంచి దీనిపైన పెద్ద చర్చ జరుగుతుంది. ఇక ఆ తర్వాత జరిగిన ఒక వేడుకలో చంటిగాడు సినిమా ఫేమ్ బాలాదిత్య రేవంత్ రెడ్డి పేరు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది. అప్పుడు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ చర్చ జరిగింది.
సీఎం కేటీఆర్ అన్న జూపల్లి కృష్ణారావు
ఇక తాజాగా జూపల్లి కృష్ణారావు సైతం ముఖ్యమంత్రి కేటీఆర్ అని ప్రస్తావించడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి సీఎం పేరునే మర్చిపోయారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది. కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేసి మాట్లాడే క్రమంలో పొరబాటున జూపల్లి కృష్ణారావు సీఎం కేటీఆర్ అనటం ఇప్పుడు రచ్చగా మారింది.
రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తున్న సొంత పార్టీ నేతలు
ఒకపక్క ప్రజాక్షేత్రంలో రేవంత్ తన మార్కు పాలనతో దూసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో సాక్షాత్తు రేవంత్ క్యాబినెట్ మంత్రులే పేరు మర్చిపోవడం రేవంత్ కు తలనొప్పిగా మారుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డిని గద్ద దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దగ్గరకు కూడా రానివ్వడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న వేళ సొంత పార్టీ నాయకుల తీరు రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇస్తుంది.












Click it and Unblock the Notifications