కాంగ్రెస్ పార్టీది రావణ రాజ్యం... నటి సంచలన కామెంట్స్...
నటీ మాధవీలత పరిచయం అక్కర్లేని పేరు. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు మాధవీలత. తరుచుగా వివాదాలపై స్పందిస్తూ ఉంటారు. ఎంతమంది ఎన్నిసార్లు ట్రోలింగ్ చేసినా వెనక్కి తగ్గకుండా తను చెప్పాలనుకునేది సూటిగా చెప్పేస్తారు. తెలుగులో నచ్చావులే సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు ఈ నటి. ఆ తర్వాత స్నేహితుడా, అరవింద్ 2 వంటి చిత్రాల్లో నటించిన అవి ఆశించిన ఫలితాలను అందించలేదు. అయితే, అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యే రాజకీయ ఆరంగ్రేటం కూడా చేశారు. బీజేపీలో పార్టీలో చేరారు. గత కొంతకాలంగా పాలిటీక్స్ కు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై సంచలన పోస్టులు పెడుతూ ఈ నటి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, నటి మాధవిలత తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పడు ఈమె చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్ పాలనలో జరిగే 5 దారుణాలు...:తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంపై మాధవీలత సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో జరగబోయే దారుణాలు ఇవే అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. తెలంగాణలో వచ్చే ఐదేళ్ల తర్వాత 1. నో ఫుడ్ 2, నో జాబ్స్, 3. నో వుమెన్ సేఫ్టీ 4. నో హిందూ ఫెస్టివల్స్ 5. నో పీస్ అంటూ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీది రావణ రాజ్యమని ఎంజాయ్ గుడ్ లక్ కాంగ్రెస్ లవర్స్ అంటూ పోస్ట్ చేశారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే..

తాను బీఆర్ఎస్‌కు 99 మార్కులు వేస్తానని చెప్పారు. ఈ పోస్ట్ కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆమె కాంగ్రెస్ పాలనపై చేసిన కామెంట్లను కొందరు సమర్థిస్తే, మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక, తెలంగాణలో బిజెపి పార్టీ గతంలో కంటే ఇప్పుడు బాగా పుంజుకుందని చెప్పారు. 2018లో ఆ బిజెపికి ఒక ఎమ్మెల్యే ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 8కి చేరిందన్నారు. మరో 19 స్థానాల్లో ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచిందని ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణలో బీజేకి ఓటు బ్యాంకు పెరిగిందని, కాషాయ పార్టీపై ఇక్కడివారికి నమ్మకం కూడా పెరిగిందని చెప్పారు. తెలంగాణలో ఇది బీజేపీకి బూస్ట్ ఇచ్చే అంశమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications