ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా: రేవంత్, మోడీ మెడిసిన్‌కు కాలం చెల్లిందన్న సీఎం
నాగ్‌పూర్: దేశంలో ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరడం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. మోడీ మెడిసిన్‌కు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ బీజేపీ పదే పదే చెబుతోందని.. డబుల్ ఇంజిన్ సర్కారు అంటే అదానీ, మోడీ అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు.
మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని 150 రోజులు 4000లకు పైగా కిలోమీటర్లు చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) వల్ల అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు.
మహారాష్ట్రలో కూడా జరగబోవు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు రేవంత్. తాజాగా రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర(Bharat Nyay Yatra)ను మణిపుర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ వ్యాఖ్యానించారు.

లోక్‌సభలో రాహుల్ గాంధీ గొంతు విప్పడంతో అదానీ ఇంజిన్ ఆగిపోయి షెడ్‌కు పోయిందని రేవంత్ ఆరోపించారు. ఇప్పుడు భారత్ న్యాయ్ యాత్రతో ప్రధాని ఇంజిన్ ఆగిపోయి.. షెడ్డుకు పంపడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులంతా వందరోజులు పాటు దేశం కోసం, కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో నిరుద్యోగ రేటు గత 40 ఏళ్లలో అత్యధిక శాతానికి చేరుకుందని ఆరోపించారు. దేశంలో రెండు భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ 139వ వ్యవస్థాపకదినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో 'హై తయార్ హమ్' (మేం సిద్ధంగా ఉన్నాం) పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు.
రాజకీయ అధికారం కోసం జరిగే పోరాటానికి సిద్ధాంతమే పునాది అని.. సామాన్యులకు అధికారాన్ని అప్పగించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ చాలా మంది ప్రజలను మళ్లీ పేదరికంలోకి నెట్టిందని ఆరోపించారు. ప్రతిభ ఆధారంగా కాకుండా అనుకూలమైన వారికే విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల బాధ్యతలు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
ఇండియా కూటమే దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలదని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ మాదిరి కాకుండా తమ పార్టీలో ఒక సాధారణ కార్యకర్త కూడా నాయకత్వాన్ని ప్రశ్నించగలడని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్తలన్నింటినీ బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ అధికారం కోసం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
ఇది(నాగ్‌పూర్) కాంగ్రెస్ పార్టీ గడ్డ. ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్ సిద్ధాంతాల గురించి చెప్పకపోయినా అర్థమవుతాయి. కాంగ్రెస్ పోరాటం మహారాష్ట్ర నుంచే మొదలైంది, అందువల్ల మీతో మాట్లాడేందుకు నాగ్‌పుర్ వచ్చాం. మీరు ఎవరికీ భయపడకూడదు. సిద్ధాంతాల కోసం మనస్ఫూర్తిగా చేస్తున్న పోరాటం ఇది. మనమంతా కలిసి మహారాష్ట్రతోపాటు దేశంలో జరిగే ఎన్నికల్లో గెలవబోతున్నామని రాహుల్ వ్యాఖ్యానించారు.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications