కేసీఆర్ నాలుకకు మైండ్ కు కనెక్షన్ కట్ అయ్యింది.!మెడమీద కత్తి పెడితే ఏదైనా చేస్తాడా.?మండిపడ్డ బండి సంజయ్.!
ఢిల్లీ/హైదరాబాద్ : బీజేపి, టీఆర్ఎస్ పార్టీల మద్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెకొన్నాయి. కేంద్ర రాష్ట్ర బీజేపి నేతలను సీఎం చంద్రశేఖర్ రావు దూషిండం, అందుకు బీజేపి నేతలు ఘాటుగా జవాబు ఇవ్వడం వంటి పరిణామాలు గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్నాయి. సోమవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేంద్ర బీజేపితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. దానికి బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ అంతే స్దాయిలో విరుచుకుపడుతున్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్ చంద్రశేఖర్ రావుపై మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా, హుందాగా మాట్లాడారని, చంద్రశేఖర్ రావుకు మతి భ్రమించిందని, కిషన్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సీఎం దిగజారుడు తనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

యాక్షన్ కు రియాక్షన్.. కేసీఆర్ పై ధ్వజమెత్తిన బండి సంజయ్
చంద్రశేఖర్ రావు నాలుకకు, మెదడుకున్న నరం కట్ అయ్యినట్లుందని, సీఎంకు సిగ్గుండాలని, ఆ భాషను చూసి జనం నవ్వుకుంటున్నరని, ముఖ్యమంత్రి సెన్సార్ భాష వాడుతున్నడని, రండ, పిచ్చి గాడిద కొడుకులు, బేవకూఫ్, నా కొడకా...అంటూ మాట్లాడుతున్నడని బండి సంజయ్ ద్వజమెత్తారు. తెలంగాణ సమాజానికి చంద్రశేఖర్ రావు నేర్పుతున్న భాష ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావుకు పిచ్చి ముదిరిందని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హద్దుమీరి దిగజారి కేంద్ర మంత్రి పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసారని మండి పడ్డారు. చంద్రవేఖర్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలని, ఏది పడితే అది మాట్లాడితే జనం సహించరని, సీఎం భాషను చూసి తన సహచరులు నవ్వుకుంటున్నరని అన్నారని, బీజేపి నేతలు కూడా అలాగే మాట్లాడితే చంద్రశేఖర్ రావు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని సూటిగా ప్రశ్నించారు బండి సంజయ్.

కొనుగోలు కేంద్రాలు మూసేస్తమని చెప్పడం తప్పు.. రైతాంగాన్న తప్పుబట్టడమేనన్న బండి
రైతులు పండించిన రా రైస్ కొంటామని చెప్పడానికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారని, చంద్రశేఖర్ రావుకు సరిగా అర్ధం కాలేదని బండి సంజయ్ అన్నారు. కేబినెట్ మీటింగ్ పెట్టి ఎట్ల తిట్టాలే, ఎట్ల బ్లఫ్ చేయాలనే అంశంపైనే చంద్రశేఖర్ రావు సుధీర్గంగా చర్చించినట్లుందని ఎద్దేవా చేసారు. రా రైస్ కొంటమని ఓ పక్క చెబుతుంటే, కేంద్రం కొనదు, కొనుగోలు కేంద్రాలు మూసేస్తమని చంద్రశేఖర్ రావు చెబుతున్నాడని ఇది రైతాంగాన్ని తప్పుదోవ పట్టించడమేనని బండి సంజయ్ తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యం ప్రతి గింజ కొని తీరాల్సిందేనని, తెలంగాణ ప్రభుత్వం ఎట్లా కొనదో చూస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

మెడ మీద కత్తి పెడితే ఏదైనా చేస్తావా..? కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించిన బండి సంజయ్
మెడమీద కత్తిపెట్టి రాయించుకున్నారని చెప్పడానికి సిగ్గుండాలని, మెడమీద కత్తిపెడితే తాలిబన్లకు, తీవ్రవాదులకు తెలంగాణను రాసిస్తావా? అని ప్రశ్నించారు. అక్టోబర్ 4న లేఖ రాసిచ్చినట్టు చెప్పుకొస్తున్న చంద్రశేఖర్ రావు హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఎందుకు చెప్పలేదని, కేంద్రం మెడ మీద కత్తి పెట్టిందని చెప్తే చంద్రశేఖర్ రావు గెలిచేవాడివి కదా అని ఎద్దేవా చేసారు. ఐనా మెడమీద కత్తిపెడితే ఫాంహౌజ్, ఆస్తులన్నీ రాసిస్తవా? అని సూటిగా ప్రశ్నించారు బండి సంజయ్.
కేంద్రంపై నెపం మోపి కొనుగోలు కేంద్రాల మూసివేత డ్రామా ఆడుతున్నాడని, వరి వేయొద్దన్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళిక ఏంటో రైతాంగానికి ఎందుకు వివరించ లేదని మండిపడ్డారు.

కేసీఆరే నిజమైన హంతకుడు.. బీజేపి హంతక పార్టీ అనడాన్న తప్పుబట్టిన బండి సంజయ్
అంతే కాకుండా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లను చంద్రశేఖర్ రావు పదేపదే పొగుడుతుంటాడని, పాకిస్తాన్ జనాభా 22 కోట్లు, నేపాల్ జనాభా 7 కోట్లు, బంగ్లాదేశ్ జనాభా 16 కోట్లు, భారత జనాభా 140కోట్లు, మరి ఆ దేశాలతో ఎందుకు పోలిక అని బండి సంజయ్ ప్రశ్నించారు. పాకిస్తాన్ ను పొగుడుతున్నాడంటే చంద్రశేఖర్ రావు అక్కడేమైనా పెట్టుబడులు పెట్టిండేమోననే సందేహాన్ని బండి సంజయ్ వ్యక్తం చేసారు. అంతే కాకుండా అక్కడి తీవ్రవాద శిబిరాలకు నిధులు సమకూరుస్తున్నాడేమోనని, నిఘా సంస్థలు దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు బీజేపీ హంతకుల పార్టీ అంటున్న చంద్రశేఖర్ రావు, బీజేపి ఎక్కడ హత్యలు చేసిందో చెప్పాలని, నిజమైన హంతకుల పార్టీ టీఆర్ఎస్సేనని, చంద్రశేఖర్ రావు పాలనలో రైతులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నరని, మంత్రి కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరని, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నరని, వీటన్నిటికీ కారణమవుతున్న చంద్రశేఖర్ రావు కంటే పెద్ద హంతకుడు ఈ దేశంలోనే ఎవరూ లేరని మండిపడ్డారు బండి సంజయ్.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications