విచారణ పేరుతో మహిళతో కానిస్టేబుల్ అసభ్యంగా..
హైదరాబాద్: కేసు విచారణకు పోలీసు స్టేషన్‌కు రావాలని ఓ 24 ఏళ్ల వివాహితను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ వ్యవహారం సంచలం కలిగించింది. అతడిని నార్సింగి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శివకుమార్ అనే కానిస్టేబుల్ టప్పాచబుద్ర పోలీసుస్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు.
ఇతడి దృష్టి తాళ్లగడ్డకు చెందిన భర్తలేని ఓ ఒంటరి మహిళపై పడింది. సదరు మహిళ అక్క అదృశ్యం కావడంతో వేరే పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. ఆ కేసుకు, ఇతనికి సంబంధం లేకున్నా వివరాలు తెలుసుకోవాలంటూ ఆమెను మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై మంచిరేవుల వేణుగోపాల స్వామి ఆలయం వద్దకు తీసుకు వచ్చాడు.

అసభ్యంగా ప్రవర్తించబోగా ఆమె తప్పించుకొని పారిపోయిది. స్థానికులకు చెప్పింది. వారు రావడంతో కానిస్టేబుల్ పారిపోయాడు. బాధితురాలు నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు. బుధవారం అతనిని అరెస్టు చేశారు.
కాగా, జైపురికాలనీ సమీపంలోని ఓ కాలనీలో బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో భార్య మృతి చెందగా, భర్తే ఆమెను ఉరివేసి చంపాడన్న కోపంతో బావమరిది బావను కత్తితో పొడిచి చంపిన సంఘటన జరిగిన విషయం తెలిసిందే. కాగా, బావను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications