Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్ ఎంపీ కేశవరావుకు కరోనా పాజిటివ్; ఢిల్లీ వెళ్ళొచ్చిన గులాబీ నేతల్లో గుబులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కల్లోలం సృష్టిస్తోంది. తెలంగాణా రాష్ట్రంలోనూ ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీలో కరోనా కలకలం కొనసాగుతుంది. గులాబి నేతలను కరోనా వెంటాడుతోంది. ఇటీవల ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీలు నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉండి వచ్చిన విషయం తెలిసిందే.

టీఆర్ఎస్ ఎంపీ కేశవరావుకు కరోనా పాజిటివ్

టీఆర్ఎస్ ఎంపీ కేశవరావుకు కరోనా పాజిటివ్

ఇప్పటికే తెలంగాణా పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా సోకగా తాజాగా ఎంపీ కేశవరావుకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాస్త అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ గా తేలింది.
అయితే తనకు కరోనా సోకిందని, అయినా ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని ఎంపీ కేశవరావు వెల్లడించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని కేశవరావు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

 ఢిల్లీ వెళ్లోచ్చిన ఎంపీ... కేశవరావు కలిసిన వారిలో కేంద్ర మంత్రులు, తెలంగాణా మంత్రులు

ఢిల్లీ వెళ్లోచ్చిన ఎంపీ... కేశవరావు కలిసిన వారిలో కేంద్ర మంత్రులు, తెలంగాణా మంత్రులు

పార్లమెంటు సమావేశాల సమయంలో ఢిల్లీలో ఉన్న ఆయన సహచర ఎంపీలు, రాష్ట్ర మంత్రుల బృందంతో కలిసి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కూడా కలిశారు. ఇక న్యూఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా వీరంతా పలువురిని కలిశారు. ఇక ఇటీవల కేశవరావు కలిసిన వారిలో కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్ లో ఉండాలని ఎంపీ కేశవరావు విజ్ఞప్తి చేస్తున్నారు.

 ఢిల్లీ వెళ్ళొచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా .. హోం ఐసోలేషన్ లో మంత్రి

ఢిల్లీ వెళ్ళొచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా .. హోం ఐసోలేషన్ లో మంత్రి

నాలుగు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ కరోనా చికిత్స తీసుకుంటున్నారు. తనను ఇటీవల కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, వారంతా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని, తనను కలవడానికి ఎవరూ తన క్యాంపు కార్యాలయానికి రావద్దని వెల్లడించారు. తాను క్షేమంగా ఉన్నానని, కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.

చేవెళ్ళ ఎంపీకి కరోనా .. ఆందోళన చెందుతున్న గులాబీ నేతలు

చేవెళ్ళ ఎంపీకి కరోనా .. ఆందోళన చెందుతున్న గులాబీ నేతలు


ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి వచ్చిన బృందంలో ఎంపీ రంజిత్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన కూడా ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా మహమ్మారి బారిన పడిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంపీ కేశవరావు ఇద్దరూ ఇటీవల జరిగిన శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి వచ్చిన మంత్రులు, ఎంపీల బృందం లో ముగ్గురికి కరోనా సోకడంతో, మిగిలినవారంతా ఆందోళన చెందుతున్నారు. ఇక ఇటీవల వీరిని కలిసిన వారు సైతం ఆందోళనలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+