Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొబైల్ ఫోన్ లో మూడుసార్లు దగ్గితే.. ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షణాల్లో.. అద్భుత ఆవిష్కరణ 'శ్వాస'!!

దగ్గు వస్తే.. ఆ దగ్గు సాధారణంగా వస్తున్న దగ్గా లేక ఊపిరితిత్తులకు సంబంధించి తీవ్రమైన అనారోగ్యాన్ని సూచిస్తున్న దగ్గా అనేది చాలా మందికి తెలియదు. అందుకే మనం దగ్గే దగ్గు సౌండ్ బట్టి ఊపిరితిత్తుల ఆరోగ్యం కనిపెట్టడానికి హైదరాబాద్ కు చెందిన సాల్సిట్ టెక్నాలజీస్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాఫ్ట్ వేర్ తయారు చేసింది. ఈ సాఫ్ట్ వేర్ తో రూపొందించిన ప్రత్యేకమైన యాప్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కొన్ని సెకన్లలోనే నిర్ధారించి మనకు చెబుతుంది.

 దగ్గు సౌండ్ బట్టి ఊపిరితిత్తుల ఆరోగ్యం కనుగొనే సాఫ్ట్ వేర్

దగ్గు సౌండ్ బట్టి ఊపిరితిత్తుల ఆరోగ్యం కనుగొనే సాఫ్ట్ వేర్


ఆల్గారిధమ్ ను ఉపయోగించి మనుషుల ఊపిరితిత్తులు ఏ విధంగా ఉన్నాయో అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా శ్వాస సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా దగ్గులో ఎన్ని రకాలు ఉంటాయో, మనం దగ్గే దగ్గు ఎలాంటిదో కనుక్కోవచ్చు. వినియోగదారులు యాప్ ఉన్న ఫోన్ దగ్గర మూడు సార్లు దగ్గితే తాగితే చాలు, ఇది మన దగ్గు సౌండ్ బట్టి మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని స్పష్టంగా చెబుతుంది. ఈ సాఫ్ట్ వేర్ నవంబర్లో ప్రతిష్ఠాత్మక అంజనీ మషేల్కర్ అవార్డును గెలుచుకుంది.

ఈజీగా ఊపిరితిత్తుల ఆరోగ్యం గుర్తించే నూతన ఆవిష్కరణ శ్వాస

ఈజీగా ఊపిరితిత్తుల ఆరోగ్యం గుర్తించే నూతన ఆవిష్కరణ శ్వాస

5 సంవత్సరాల క్రితం సాల్సిట్ టెక్నాలజీస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ రావు శ్రీపాద, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్ లు ఈ సాఫ్ట్ వేర్ శ్వాస ఆవిష్కరణకు పునాది వేశారు. ప్రస్తుతం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరిష్కరించడానికి ఉపయోగించే అత్యంత సాధారణమైన ప్రామాణికమైన పద్ధతుల్లో సిర్రో మెట్రీ ఒకటి, కానీ దానికి ఖరీదైన స్పిరో మీటర్ లు మరియు శిక్షణ పొందిన సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది. ఇక ఈ సదుపాయం గ్రామీణ మారుమూల ప్రాంతాలలో అందుబాటులో లేదు. ఈ సమయంలో సాల్సిట్ తీసుకు వచ్చిన ఈ సాఫ్ట్ వేర్ యాప్ గ్రామీణ మారుమూల ప్రాంతాలలో సైతం అందుబాటులోకి వస్తే, శ్వాసకు సంబంధించిన ఆందోళనలు అన్నింటిని తొలగిస్తుందని భావిస్తున్నారు.

వినియోగదారుల కోసం కాదు.. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులకే ఈ యాప్ వినియోగానికి ఛాన్స్

వినియోగదారుల కోసం కాదు.. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులకే ఈ యాప్ వినియోగానికి ఛాన్స్


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌గా శ్వాస పనిచేస్తుంది. దీన్ని ఫోన్‌లోని యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. కానీ ఇది వినియోగదారుల కోసం తయారుచేసిన సాఫ్ట్వేర్ కాదు. దీనిని వినియోగదారులు డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించలేరు. ఆరోగ్య కార్యకర్తలు మరియు వైద్య బృందాల కోసం ఈ సాఫ్ట్వేర్ రూపొందించబడింది అని తెలుస్తుంది. ఫోన్ లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆరోగ్య కార్యకర్తలు రోగి యొక్క ప్రొఫైల్ ను సృష్టించి, ఆపై వినియోగదారులకు లింకు సృష్టించి వారి యొక్క ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరీక్షించవచ్చు. ఇక ఆరోగ్య కార్యకర్త పంపే లింక్ ను ఉపయోగించి కూడా వినియోగదారులు తమ దగ్గు పరిస్థితిని తనిఖీ చేసుకోవచ్చు.

 సిర్రోమెట్రీ అవసరం లేకుండా సాఫ్ట్ వేర్ తో ఊపిరితిత్తుల స్థితి నిర్ధారణ

సిర్రోమెట్రీ అవసరం లేకుండా సాఫ్ట్ వేర్ తో ఊపిరితిత్తుల స్థితి నిర్ధారణ


ఇక వీటి ఆధారంగా అవసరమైతే ఆరోగ్య కార్యకర్తలు వైద్యుల వద్దకు వినియోగదారుల ఆరోగ్య నివేదికలను తీసుకువెళ్ళవచ్చు. రోగ తీవ్రతను బట్టి వినియోగదారులకు సలహా ఇవ్వచ్చు అని సమాచారం. ఊపిరితిత్తుల పరిస్థితి ఆధారంగా రోగ నిర్ధారణపై మరింత నిర్ణయం తీసుకోవడానికి వైద్యులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. సిర్రోమెట్రీ అవసరం లేకుండా ఈ సాఫ్ట్ వేర్ ద్వారా రోగి ఊపిరితిత్తుల స్థితిని అంచనా వేసి ఆపై వైద్య చికిత్స అందించడానికి వీలవుతుందని చెబుతున్నారు.

 దగ్గు సౌండ్ ఆధారంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం.. వైద్య రంగంలో సాధించిన ప్రగతికి నిదర్శనం

దగ్గు సౌండ్ ఆధారంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం.. వైద్య రంగంలో సాధించిన ప్రగతికి నిదర్శనం


సాఫ్ట్ వేర్ ఏ విధంగా పనిచేస్తుంది అన్న ధ్రువీకరణ కోసం, ఈ సంవత్సరం ప్రారంభంలో దీనిని వంద మందిపై ప్రయోగించి పరీక్షలు చేసినట్టు, రోగులపై కూడా దీనిని ప్రయోగించినట్టు, మంచి ఫలితాలు వచ్చినట్లుగా చెబుతున్నారు సాఫ్ట్ వేర్ రూపకర్తలు. ఏది ఏమైనా దగ్గు సౌండ్ ఆధారంగా, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కనిపెట్టే ఈ సాఫ్ట్ వేర్ వైద్య రంగంలో సాధించిన ప్రగతిగా మనం చూడాల్సిన అవసరం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+