జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పడతాది
జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందడి నెలకొంది. ఈ నెల 11వ తేదీన పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇంకాస్సేపట్లో ఆరంభం కానుంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమౌతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తెరుస్తారు. యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్లను లెక్కిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాటన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే పూర్తి చేసింది.
మొత్తం 10 రౌండ్ల పాటు లెక్కింపు పూర్తి కానుంది. 42 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా విజేత ఎవరో తేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలో నాలుగు లక్షలమందికి పైగా ఓటర్లు ఉన్నప్పటికీ.. అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైన విషయం తెలిసిందే. సగం కూడా పోలింగ్ నమోదు కాలేదు. 1,94, 632 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో తెల్లవారు జాము నుంచే కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. వారికి అందజేసిన పాస్ లను తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతి ఇస్తోన్నారు. ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి వస్తోన్నారు. ఆంక్షలు ఉన్న నేపథ్యంలో 100 మీటర్లను దాటుకుని వారంతా లోనికి రావడానికి అనుమతి లేదు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ సాగుతోంది.
బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొత్తం ముగిసింది. ఆయా పార్టీలన్నీ ప్రచారబరిలో దిగాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.
జూబ్లీహిల్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉప ఎన్నికల పోలింగ్ ఆరంభం కానుంది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్- బుడ్గామ్, నగ్రోటా సహా రాజస్థాన్- అంటా, జార్ఖండ్- ఘట్సిలా, పంజాబ్- తర్న్ తరణ్, మిజోరాం- డంపా, ఒడిశా- నౌపాడాలో కౌంటింగ్ ఇంకాస్సేపట్లో ప్రారంభమౌతుంది.
- నౌపాడా- బిజు జనతాదళ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్ర ధోలాకియా మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.
- జమ్మూ కాశ్మీర్ - ఒమర్ అబ్దుల్లా రాజీనామా చేయడంతో బుడ్గామ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రెండుచోట్ల పోటీ చేశారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణంతో నగ్రోటా ఉప ఎన్నిక జరిగింది.
- అంటా - బీజేపీ ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనాపై అనర్హత వేటు పడటం వల్ల బైపోల్ నిర్వహించారు.
- డంపా- మిజో నేషనల్ ఫ్రంట్ ఎమ్మెల్యే లాల్రిట్ లుంగో సైలో మరణంతో ఉప ఎన్నిక జరిగింది.
- తర్న్ తరణ్- ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాశ్మీర్ సింగ్ సోహల్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
- ఘట్శిల- జేఎంఎం ఎమ్మెల్యే, మంత్రి రాందాస్ సోరెన్ మరణం తరువాత ఉప ఎన్నిక నిర్వహించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications