విల్లా పేరుతో 2.5 కోట్ల మోసం: టాలీవుడ్ స్టార్స్‌కూ కి'లేడీ' టోకరా
హైదరాబాద్: విశాఖలో విల్లాల పైన పెట్టుబడి ద్వారా పెద్ద ఎత్తున లాభం పొందవచ్చునని నమ్మించి, దాదాపు రూ.2.5 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన సంఘటన హైదరాబాదులో జరిగింది. విల్లాల పైన పెట్టుబడి పేరుతో బంజారాహిల్స్‌లో పలువురి నుంచి పెద్ద మొత్తంలో ఓ జంట డబ్బులు వసూలు చేసింది.
ఇలా పెట్టుబడులు పెట్టిన వారిలో టాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారని తెలుస్తోంది. పెట్టుబడులు పెట్టి మోసగించిన ఆ జంట లలిత, ఆమె భర్త శ్రీవాత్సవ. బాధితుల నుంచి డబ్బులు, బంగారం, నగలు ఇలా అన్నింటిని తీసుకున్నారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు.
వివరాల మేరకు... లలిత, శ్రీవాత్సవ భార్యాభర్తలు. వారు సీతాఫల్‌మండిలో నివాసం ఉంటారు. వీరి బంజారాహిల్స్‌లో ఉండే పలువురు మహిళలతో పరిచయం పెంచుకొని, విశాఖలో విల్లాల పైన పెట్టుబడులు పెట్టాలని సూచించారు. అలా పెడితే బాగా లాభం వస్తుందని చెప్పారు.

ఇలా, బాధితుల నుంచి దాదాపు రూ.2.5 కోట్ల మేర వసూలు చేశారు. పది మంది నుంచి ఆ మొత్తం వసూలు చేశారు. ఒక్కో బాధిత మహిళ రూ.2 లక్షల నగదు నుంచటి రూ.25 లక్షల నగదు వరకు ఇచ్చారు. అలాగే, తమ వద్ద ఉన్న బంగారం కూడా ఇచ్చారు.
ఆ తర్వాత వారికి తాము మోసపోయామని తెలిసింది. పోలీస్ కమిషనర్‌ను కలిశారు. వారు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ జరుపుతున్నారు.
ఇప్పటికే, వారి విచారణలో ఆ జంట మోసం చేసినట్లుగా గుర్తించారు. లగ్జరీ జీవితం గడిపేందుకు వారు చీటింగ్ చేసినట్లుగా గుర్తించారు. ఆభరణాలను తాగట్టు పెట్టినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం వారు పరీరాలో ఉన్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీస్ టీం ఏర్పడింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications