లేడీ టెక్కీపై గ్యాంగ్ రేప్: నిందితులపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌కు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేయాలని గురువారం కోర్టు పోలీసులను ఆదేశించింది.
తనపై నిజాంపేటకు చెందిన సంకు రమణ, కాసగోని రాజేష్, కిరణ్‌అత్యాచారానికి పాల్పడ్డారని, దానికితోడు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని ఆమె గత నెల 25 కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కోర్టు నిందితులపై కేసు నమోదు చేయాలంటూ హైదరాబాదులోని మాదాపూర్ పోలీసులను ఆదేశించింది.

ఇదిలావుంటే, మరో అత్యాచారం కేసును కర్ణాటకలోని గంగావతికి బదిలీ చేశారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యువతి జూబ్లీహిల్స్‌లోని ఐటి సంస్ధలో పనిచేస్తోంది. నెల రోజుల క్రితం అదే ఐటి సంస్థకు చెందిన మరో ఇద్దరు యువకులతో కలిసి బెంగళూరు హంపీ పర్యటనకు వెళ్లింది.
ముగ్గురు కలిసి హంపీకి సమీపంలోని గాంగావతి పరిధిలోని ఓ లాడ్జీలో రూమ్ తీసుకుని మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో అత్యాచారం జరిగినట్లు యువతి గంగావతి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. అయతే మాదాపూర్ పోలీసులు ఈవిషయంలో చొరవ తీసుకుని రాజ్‌కుమార్ షైనీ, రోహిత్ అనే యువకులపై కేసు నమోదు చేసి కర్ణాటకలోని గంగావతి స్టేషన్‌కు బదిలీ చేశారు.












Click it and Unblock the Notifications