తెలంగాణలో కరోనా: 1771 కొత్త కేసులు, 13 మరణాలు -ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పెరిగిన వ్యాప్తి

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిగా అదుపులోకి వస్తున్నది. అయితే, ఇన్నాళ్లూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా కొత్త కేసులు రాగా, ఇప్పుడది జిల్లాల్లో చోటుచేసుకుంటుండటం కలవరపెడుతున్నది. రికవరీలు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెలువరించిన బులిటెన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,525 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 1,771 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,02, 089కి పెరిగింది.

covid-19 in Telangana: 1,771 new cases, 13 deaths in last 24 hrs, active cases down to 22k

జీహెచ్ఎంసీ పరిధిలో 171 కొత్త కేసులు నమోదుకాగా, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో హైదరాబాద్ స్థాయిలో కొత్త కేసులు వచ్చాయి. నల్గొండ జిల్లాలో 157, ఖమ్మం జిల్లాలో 149, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 107, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 104 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 2 కేసులు గుర్తించారు.

నిన్న ఒక్కరోజే కొవిడ్ కారణంగా 13 మంది చనిపోయారు. దీంతొ మొత్తం మరణాల సంఖ్య 3,469కి పెరిగింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.3శాతంకాగా, తెలంగాణలో అది 0.57శాతంగా ఉంది. తాజాగా 2,384 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో రికవరీల సంఖ్య 5,76,487కు పెరిగింది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 95శాతంకాగా, తెలంగానలో అది 95.74శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 22,133కు పడిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+