తెలంగాణలో కరోనా వైరస్ బీభత్సం -కొత్తగా 2055కేసులు, ఒక్కరోజే ఏడుగురు మృతి
తెలంగాణలో కరోనా వైరస్ జెడ్ స్పీడు వేగంతో వ్యాపిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకే రోజు నిర్ధారణ అయిన కొత్త కేసుల్లో ఇవాళ మరో రికార్డు నమోదైంది. రికవరీ రేటు తగ్గుతూ, మరణాల రేటు పెరుగుతూ వెళుతోంది..
Recommended Video

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ లోని వివరాల ప్రకారం నిన్న రాత్రి 8గంటల వరకు 87,332 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, కొత్తగా 2,055 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,18,704కు పెరిగింది.

కొవిడ్ వ్యాధి కారణంగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,741కి చేరింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.3శాతంకాగా, తెలంగాణలో అది 0.54 శాతంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కొత్త కేసుల్లో మూడింతలు కూడా డిశ్చార్జీలు లేకపోవడంతో యాక్టివ్ కేసులు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 303 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీరేటు 91.7శాతంకాగా, తెలంగాణలో అఅది 95.26శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,362కు పెరిగింది. అందులో హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతోన్నవారి సంఖ్య 8,263గా ఉంది.
కొత్తగా నమోదైన 2055 కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధి నుంచే 398 కేసులొచ్చాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 214, నిర్మల్ లో 100, నిజామాబాద్ జిల్లాలో 169, రంగారెడ్డి జిల్లాలో 174, జగిత్యాల జిల్లాలో 99 కొత్త కేసులు వచ్చాయి.












Click it and Unblock the Notifications