అదనపు మెజిస్ట్రేట్ హోదాలో కేసు విచారించిన సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా.. ప్రజలను ఇబ్బంది పెట్టినా ఊరుకునేది లేదని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ జిల్లా అదనపు మెజిస్ట్రేట్ హోదాలో కార్యనిర్వాహక కోర్టును నిర్వహించారు.

హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పెట్టిన పిటిషన్‌ను విచారించారు. హుమాయున్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌లోని సీసీ రోడ్డు ఘటన విషయంలో నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మజీద్ హుస్సేన్ కి, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మధ్య రాజకీయ వైరం ఉందని తెలిపారు. ఘటనలో భాగంగా శాంతిభద్రతలకు భంగం కలిగించినందుకు ఇరువర్గాలపై కేసు నమోదు చేశామని చెప్పారు.

CP CV Anand tried the case as Additional Magistrate

ఈ క్రమంలో మజీద్ హుస్సేన్, ఫిరోజ్ ఖాన్ గ్రూపుల వాదనలు విన్నారు అదనపు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సీపీ సీవీ ఆనంద్. రెచ్చగొట్టే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఇద్దరు నేతలకు సూచించారు. ఇరువర్గాల ఘర్షణతో సమాజానికి చెడు జరుగుతుందన్నారు. మరోసారి ప్రజలకు ఇబ్బంది కలిగేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. అనంతరం కేసు విచారణను వాయిదా వేశారు.

కాగా, నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని విజయనగర్ కాలనీ, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురు వీధిలోని ఫిరోజ్ గాంధీనగర్‌లో రూ. 17 లక్షలతో గత శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పనుల కోసం పోసిన కంకరపై జారిపడి కాంగ్రెస్ నేత ఉస్మాన్ గాయపడ్డాడు. దీంతో ఆయనను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అక్కడికి వెళ్లారు.

ఈ సందర్భంగా రోడ్డు నిర్మాన పనుల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. దీంతో స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ కు స్థానిక నేతలు ఫోన్ చేశారు. వెంటనే ఎమ్మెల్యేతోపాటు భారీగా చేరుకున్న అనుచరులు ఫీరోజ్ ఖాన్, కాంగ్రెస్ శ్రేణులపైకి దూసుకెళ్లారు. దీంతో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+