వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్!

ఈ డిజిటల్ యుగంలో ఎంతోమంది సరైన అవగాహన లేక సైబర్ మోసాల బారిన పడి తమ జీవితాన్ని నరకప్రాయం చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో ప్రజలకి సరైన అవగాహన కల్పించడం కోసం నేనున్నాను అంటూ ముందుకొచ్చారు సజ్జనార్. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు.

పిల్లల విషయంలో సీపీ సజ్జనార్ సూచనలు

హైదరాబాద్ నగరం లో లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు పాటుపడుతూనే, సామాజిక అంశాలపై నగర ప్రజలకు నిత్యం దిశానిర్దేశం చేస్తూ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారు . సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన పోస్ట్‌లు వైరల్ కూడా అవుతుంటాయి.తాజాగా, సజ్జనార్ తల్లిదండ్రులకు చేసిన కీలక సూచనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా మసలుకోవాలో ట్వీట్ చేశారు.

cp sajjanar said Children May Engage in This Activity During Summer Holidays Parents Stay Alert

సోషల్ మీడియా వాడకంపైన అలెర్ట్

సెలవలు వచ్చాయి ..పిల్లలు ఎంజాయ్ చేస్తారులే అని వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు సజ్జనార్. స్కూళ్లకు ఎలాగూ సెలవులు.. ట్యూషన్లు కూడా పెద్దగా ఉండవు .. అందుకే అధికశాతం పిల్లలు ఖాళీగా ఉండి, ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు , ట్యాబులతో కాలక్షేపం చేస్తున్నారు. సోషల్ మీడియా బానిసలుగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫోన్లకి అతుక్కుపోతున్నారని సజ్జనార్ ట్వీట్ లో పేర్కొన్నారు.

స్మార్ట్‌ఫోన్ వ్యసనం బారిన పడటం తీవ్ర ఆందోళన

వేసవి సెలవులు ఎంజాయ్ చేయడం లో తప్పేమీ లేదు కానీ.. ఆ వినోదం డిజిటల్ వ్యసనంగా మారకూడదని తల్లిదండ్రులను హెచ్చరించారు సజ్జనార్. సమ్మర్ హాలిడేస్ అంటే ఒకప్పుడు అమ్మమ్మ ఊరిలో పచ్చటి పొలాలు,పల్లెటూరు, అక్కడి మైదానాల్లో గల్లి క్రికెట్ సందడి గుర్తుకు వచ్చేవని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. కానీ, ప్రస్తుత సమాజంలో పిల్లలు మాత్రం కేవలం స్మార్ట్‌ఫోన్ వ్యసనం బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సజ్జనార్ పేర్కొన్నారు.

పిల్లల ఆరోగ్యం విషయంలో సీపీ సజ్జనార్ అలెర్ట్

తల్లిదండ్రులు తమ ఆఫీసు పనుల్లో పూర్తిగా నిమగ్నమై, పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపకపోవడం వల్ల వారు డిజిటల్ వ్యసనం బారిన పడి ఒంటరితనానికి గురవుతున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. దీంతో, పిల్లలు సోషల్ మీడియాలో అపరిచితుల మాయలో పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని.. షార్ట్స్, రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలై తిండి, నిద్ర మానేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అని సీపీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లలకు మీరు ఇవ్వాల్సిన బహుమతి ఇదే

సమాజంలో కలవలేక చిన్నపాటి మందలింపులకే కలత చెంది పిల్లలు ఇంట్లో నుండి పారిపోతున్న సంఘటనలు తరచుగా హైదరాబాద్‌ లో వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు బాధిత కుటుంబాల్లో ఎంతో మనోవేదనను కలిగిస్తున్నాయి అని సజ్జనార్ పేర్కొన్నారు.ఈ సెలవుల్లో పిల్లలకు గ్యాడ్జెట్‌ ల కన్నా తల్లిదండ్రులు తమ సమయాన్ని ఇవ్వడమే గొప్ప బహుమతి అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ దిశా నిర్దేశం

అదేవిధంగా, వారు ఇంటర్నెట్ లో ఏమి చూస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు అనే విషయాలపై నిరంతరం నిఘా పెట్టాలని సజ్జనార్ సూచించారు.మరీముఖ్యంగా పరీక్షా ఫలితాల విషయంలో పిల్లలకు పూర్తి దిశానిర్దేశం కల్పిస్తూ, వారి చేష్టలను నిత్యం గమనిస్తూ సరైన మార్గంలో నడిపించాలని సజ్జనార్ సూచించారు. తల్లిదండ్రుల అప్రమత్తతే తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు మేలు చేస్తుంది అని..అదే వాళ్ళకి శ్రీరామరక్ష అని సీపీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+