మొదలు అక్కడే: చంద్రబాబుపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపికి అనుకూలగా ఉంటే గవర్నర్ మంచోడు, కాకపోతే మంచివారు కాదా అని ఆయన అడిగారు. ఓటుకు కోట్లు వ్యవహారం చంద్రబాబుతోనే ప్రారంభమైందని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తన బాధను ప్రజల బాధగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు ఢోకా లేదని నారాయణ అన్నారు. ఓటుకు నోటు వ్యవహారం పవిత్ర రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు అవసరంలేదన్నారు.

 CPI leader Narayana comments on Chandrababu

రాష్ట్ర విభజన జరిగేటపుడు చంద్రబాబు సెక్షన్-8పై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. గవర్నర్ పాలనకు సీపీఐ వ్యతిరేకమన్నారు.

రాష్ట్రంలోని తాజా పరిస్థితులను కేంద్ర అధికారులకు మరోసారి వివరించానని ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడు అన్నారు. శుక్రవారంనాడు ఆయన కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి, జాయింట్ సెక్రటరీలను ఢిల్లీలో కలిశారు.

షెడ్యూల్ 9, 10 లోని అంశాలను పరిష్కరించాలని కోరానని తెలిపారు. సెక్షన్-8పై అధికారులు ఏ విధంగానూ స్పందించలేదన్నారు. కొత్తగా గవర్నర్‌కు ఇవ్వాల్సిన అధికారాలేవీ లేవని, గవర్నర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+