దీపావళి వేడుకల్లో అపశృతి: తెెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రమాదాలివే

హైదరాబాద్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే సంబరాల వెంటే ప్రమాదాలు కూడా రెండు రాష్ట్రాల ప్రజలు ముప్పు తిప్పులు పెట్టాయి. దీపావళి వేడుకల్లో భాగంగా ఎగిసిన నిప్పురవ్వల కారణంగా హైదరాబాదు, విజయవాడ, భువనగిరి తదితర ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి.

Crackers godown caught fire in hyderabad

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అదేవిధంగా వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ఏడు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

వనస్థలీపురం రైతుబజార్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ఏడు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాలుతున్న రాకెట్ పడి మంటలు చెలరేగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు అబిడ్స్‌లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అగ్ని కీలలలు ఎగసిపడ్డాయి. అయితే వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

ఇక విజయవాడలో నింగికెగసిన నిప్పురవ్వల కారణంగా మూడు స్కూల్ బస్సులు కాలిపోయాయి. నల్లగొండ జిల్లా భువనగిరిలోనూ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు దుకాణాలు, ఓ కారు, మరో బైకు కాలి బూడిదయ్యాయి.

వీటితో పాటు చిన్నారులు టపాకాయలు కాలుస్తుండగా నిప్పురవ్వలు ఎగిసి పడి పలువురు చిన్నారులకు కంటి సమస్యలు తలెత్తాయి. చిన్నారులకు సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో చికిత్సను అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+