Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

cyber crimes: కౌన్ బనేగా కరోడ్‌పతి.. సైబర్ నేరగాళ్ళ మోసంచూస్తే పోతుంది మీ మతి!!

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక చోట సైబర్ నేరగాళ్ల వలలో పడి సామాన్య ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తామని, బహుమతులు వచ్చాయని ఇలా రకరకాల పేర్లు చెప్పి ఖాతాలకు కన్నం వేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో కొత్త తరహా నేరానికి పాల్పడుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.

కౌన్ బనేగా కరోడ్‌పతి పేరుతో సైబర్ మోసం

కౌన్ బనేగా కరోడ్‌పతి పేరుతో సైబర్ మోసం


సైబర్ నేరగాళ్లు కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టకుండా దోపిడీకి పాల్పడుతున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు అని సందేశాలు పంపిస్తూ మోసాలకు దిగుతున్నారు. ఇక ఈ డబ్బులు చెల్లించాలి అంటే ఢిల్లీ సీఎం అప్రూవల్ ఇవ్వాలని, దానికోసం అప్రూవల్ ఛార్జీలు, సిబిఐ ఛార్జీలు చెల్లించాలని కట్టు కథలు చెప్పి మోసం చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే తరహా మోసానికి హైదరాబాద్ నగరానికి చెందిన ఒక వ్యక్తి బలైపోయాడు.

సైబర్ నేరగాళ్ళు ట్రాప్ చేస్తారిలా..

సైబర్ నేరగాళ్ళు ట్రాప్ చేస్తారిలా..

కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో డబ్బులు వచ్చాయని, ఇరవై ఐదు లక్షల రూపాయలను తీసుకోవాలంటే కొన్ని ఛార్జీలు చెల్లించాలని, ఓ వ్యక్తిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు అతని వద్ద నుండి 3.03 లక్షల రూపాయలను ఇప్పటి వరకు వసూలు చేశారు. ఆగస్టు 15వ తేదీన వాట్సాప్ లో ఒక సందేశం ద్వారా కౌన్ బనేగా కరోడ్‌పతి లో 25 లక్షల రూపాయలు గెలిచావని ఒక బ్రోచర్ పంపించారు. ఆపై రాణా ప్రతాప్ సింగ్ పేరుతో ఫోన్ చేసిన ఒక సైబర్ నేరగాడు, కౌన్ బనేగా కరోడ్‌పతి లో గెలిచిన మొత్తాన్ని పొందాలంటే మరొక వ్యక్తికి ఫోన్ చేయాలంటూ నెంబర్ ఇచ్చారు.

సైబర్ నేరగాళ్ళ వలలో పడిన బాధితుడు, మూడు లక్షలకు పైగా చెల్లింపు

సైబర్ నేరగాళ్ళ వలలో పడిన బాధితుడు, మూడు లక్షలకు పైగా చెల్లింపు

అది నమ్మిన బాధితుడు సదరు వ్యక్తికి ఫోన్ చేయగా, డబ్బులు పంపించడానికి బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని సూచించాడు. డబ్బులు పంపిస్తారు అని నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు పంపించిన బాధితుడిని ఆపై ఢిల్లీ ముఖ్యమంత్రి అప్రూవల్ ఛార్జి, సిబిఐ ఛార్జి, రవాణా ఛార్జి, డాక్యుమెంటేషన్ ఛార్జి, ఎల్ఐసి పాలసీ, ఎన్ఓసి ఇలా పలు ఛార్జీలను చెల్లించాలని లిస్టు ఏకరువు పెట్టాడు. ఇదంతా నమ్మిన సదరు బాధితుడు తన స్నేహితుల ద్వారా వాళ్లు చెప్పిన అకౌంట్లకు డబ్బులు పంపించాడు.

మళ్ళీ మళ్ళీ డబ్బులు అడుగుతున్న నేరగాళ్ళు .. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు

మళ్ళీ మళ్ళీ డబ్బులు అడుగుతున్న నేరగాళ్ళు .. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు


మొత్తం మూడు లక్షల మూడు వేల రూపాయలు చెల్లించిన బాధితుడు, సెక్యూరిటీ పర్పస్ 31 వేల రూపాయలు పంపించమని మళ్లీ సైబర్ క్రిమినల్స్ ఫోన్ చేయడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం పేరుతో మోసం చేశారని గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి మెసేజ్ లను నమ్మొద్దని, డబ్బులు ఇస్తామని చెప్తే ప్రలోభానికి గురికావద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బు సైబర్ నేరగాళ్ల పాలు చెయ్యొద్దని సూచిస్తున్నారు. సెల్ ఫోన్ లో, వాట్సాప్ లో వచ్చే ఇటువంటి మెసేజ్ లకు రెస్పాండ్ కావద్దని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+