వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

cyber crimes: రెండేళ్ళ నెట్‌ఫ్లిక్స్ సబ్​స్క్రిప్షన్ ఫ్రీ; నిజమని నమ్మారా.. మీపని గోవిందా!!

|
Google Oneindia TeluguNews

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా డిజిటల్ చెల్లింపులు కూడా పెరిగాయి, ఇక అంతకు మించిన వేగంతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే టెక్నాలజీని ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు సైబర్ నేరాలకు జరుగుతున్న తీరు పట్ల అవగాహన కలిగి ఉండాలి. సైబర్ నేరాలను గుర్తించటంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది.

నెట్ ఫ్లిక్స్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్ళు

నెట్ ఫ్లిక్స్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్ళు


సమాజంలో సైబర్ నేరగాళ్లు జనాలను బురిడీ కొట్టించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా జనాలను ప్రలోభపెట్టి, తమ ట్రాప్ లోకి తెచ్చుకుని అమాయక ప్రజల సొమ్ము కాజేయడానికి వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. మీరు యాపిల్ ఐఫోన్ లు గెలుచుకున్నారు.. మీకు అమెజాన్ లో గిఫ్ట్ లు వచ్చాయి, వీటిని తీసుకోవాలంటే ఈ పని చేయండి అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వారు తాజాగా నెట్ ఫ్లిక్స్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్నారు.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రెండేళ్ళ సబ్ స్క్రిప్షన్ ఫ్రీ అంటూ సందేశాలు

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రెండేళ్ళ సబ్ స్క్రిప్షన్ ఫ్రీ అంటూ సందేశాలు


నెట్ ఫ్లిక్స్ వినియోగదారులకు రెండు సంవత్సరాల నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నాం అంటూ వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్ అకౌంట్లకు పంపిస్తూ ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ పేరుతో మీరు సబ్ స్క్రిప్షన్ గెలుచుకున్నారు కాబట్టి ఆ ఆఫర్ ను పొందాలి అంటే ఈ క్యూఆర్ కోడ్ ను మీ సెల్ తో స్కాన్ చేయండి అని పంపిస్తున్నారు. చాలా మంది నెట్ ల=ఫ్లిక్స్ వినియోగదారులు నిజంగానే తమకు నెట్ ఫ్లిక్స్ ఈ ఆఫర్ ఇస్తుందా అని నమ్మి క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇవి ఫేక్ పోస్టులు అని ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఇక ఈ పోస్టులు నిజమే అనుకొని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ కావడం పక్కా అని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అనుమానాస్పద లింకులు ఓపెన్ చెయ్యకండి..సైబర్ క్రైం పోలీసుల హెచ్చరిక

అనుమానాస్పద లింకులు ఓపెన్ చెయ్యకండి..సైబర్ క్రైం పోలీసుల హెచ్చరిక


ఇలాంటి మెసేజ్ ఏదైనా మీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కి వస్తే వెంటనే డిలీట్ చేయండి. పొరపాటున కూడా క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయకండి అని సూచిస్తున్నారు సైబర్ క్రైం పోలీసులు. ఇక ఇటువంటి సైబర్ నేరాలపైన జాగ్రత్తగా ఉండాలని, పొరపాటున నిజమని నమ్మితే అజాగ్రత్తగా వ్యవహరిస్తే అనర్థం జరుగుతుందని చెబుతున్నారు. ఎవరు ఏం చెప్పినా, అనుమానాస్పదంగా వచ్చిన లింకులను ఓపెన్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

సైబర్ నేరాలకు గురైతే డయల్ 1930

సైబర్ నేరాలకు గురైతే డయల్ 1930


ఇక సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930 నెంబర్ కి ఫోన్ చేసి తమ ఫిర్యాదులను చేయాలని సూచిస్తున్నారు. సైబర్ నేరాలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే, నేరపరిశోధన సులభమవుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఇలా ఫిర్యాదు చేయడం వల్ల సైబర్ దాడుల వల్ల జరిగిన నష్టాన్ని త్వరితగతిన పరిష్కరించడానికి వీలు కలుగుతుందని పోలీసులు చెబుతున్నారు.

English summary
Cyber crime police warn that if you scan the QR codes in the posts claiming to be free for two years of Netflix subscription, cybercriminals will steal money from your bank account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X