Cyber Crime: న్యూడ్ కాల్ చేసి బ్లాక్ మెయిల్.. చివరికి ఏం జరిగిందంటే..!
సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. కొంత మంది వారి ప్రమేయం లేకున్నా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నారు. వాట్సాప్ వీడియో కాల్ చేసి ఆగం చేస్తున్నారు మోసగాళ్లు. అమ్మాయిలు వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే బట్టలు విప్పుతారు. ఇలోగా మనం కట్ చేసినా అప్పటికే దాన్ని వారు రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ వీడియో పంపించి బ్లాక్ మెయిల్ చేస్తారు. డబ్బులు గుంజుతారు. సామాన్య ప్రజలే కాకుండా కీలకమైన హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి మొదలుకొని ఉన్నతాధికారులను వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
వాట్సాప్ ద్వారా కాల్స్ చేస్తూ.. అవతలి వ్యక్తి అప్రమత్తం అయ్యేలోపే స్క్రీన్ షాట్స్ తీస్తున్నారు. వాటిని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. అంతే కాదు న్యూడ్ కాల్ మాట్లాడిన యువతి ఆత్మహత్య చేసుకుంది.. పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
అయితే తెలియని నంబర్ల నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయవద్దని చెబుతున్నారు. కొందరు నిద్ర పోయేటప్పుడు ఫోన్ వస్తుంది. అప్పుడు వారు నిద్ర మత్తులో ఫోన్ లిఫ్ట్ చేస్తారు.

వారు అప్రమత్తమయ్యే లోపే వీడియో రికార్డ్స్, స్క్రీన్ షాట్స్ తీస్తారు. కొంత మంది యువతులు ముఖం కనిపించకుండా న్యూడ్ కాల్స్ చేస్తారు. మిగితా శరీరం మాత్రం కనిపించేలా చేస్తారు. అందుకే తెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయకూడదని పోలీసులు చెబుతున్నారు. తాజాగా జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌లోని ఓ శాఖకు చెందిన అధికారికి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే వీడియో కాల్ చేసిన యువతి బట్టలు విప్పింది.
ఆ వెంటనే ఆయన ఫోన్ కట్ చేశారు. కానీ అప్పటికే యువతి దాన్ని రికార్డ్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేస్తామని బెదిరించింది. రూ.35 వేలు ట్రాన్స్ ఫర్ చేయాలని డిమాండ్ చేసింది. అయితే సహా ఉద్యోగులు ఆయనకు ధైర్యం చెప్పారు. దీంతో ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమ్మాయిల పేరుతో వచ్చే వాట్సాప్ వీడియో కాల్స్ కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications