కెసిఆర్‌ను పరామర్శించడానికే వచ్చా, త్వరలోనే టిఆర్ఎస్‌లోకి: డీఎస్
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జ్వరంతో బాధపడుతున్నారని తెలిసి పరామర్శించడానికి వచ్చానని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం సిఎం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సిఎం కెసిఆర్‌తో భేటీ అయ్యారు.
సమావేశం అనంతరం డీఎస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఇతర నేతలు పక్కదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరేది ఇంకా నిర్ణయిచలేదని చెప్పారు. తనతోపాటు ఎవరెవరు వస్తారో త్వరలోనే చెబుతానని డి శ్రీనివాస్ చెప్పారు.

కాగా శాసనమండలిలో తిరిగి అవకాశం ఇవ్వనందుకు అసంతృప్తికి గురైన డీఎస్ కాంగ్రెస్ పార్టీని వీడి, కారు ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన జులై 6వ తేదీన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్న మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుజ్జగించే పనిలో పడ్డారు. ఆయనతో చర్చలు జరిపేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, భట్టి విక్రమార్క, వీహెచ్, శ్రీధర్‌బాబు, డీకే అరుణ్ తదితరులు డీఎస్ నివాసానికి వెళ్లారు. నేతలు వచ్చే సమయానికి డీఎస్ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. దీంతో కాంగ్రెస్ నేతలు వెనుదిరిగారు.












Click it and Unblock the Notifications