వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాం, బాబు లక్ష్మీపార్వతి కారు డోర్ తీసేవారు: దగ్గుబాటి, జూ.ఎన్టీఆర్‌పై...

లక్ష్మీపార్వతి కారు డోర్‌ను చంద్రబాబు తీసేవారని, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అల్లుళ్లం వెన్నుపోటు పొడిచామని, జూనియర్ ఎన్టీఆర్‌కు సినిమాలతో పాటు రాజకీయ కళ కూడా ఉందని దగ్గుబాటి అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లక్ష్మీపార్వతి కారు డోర్‌ను చంద్రబాబు తీసేవారని, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అల్లుళ్లం వెన్నుపోటు పొడిచామని, జూనియర్ ఎన్టీఆర్‌కు సినిమాలతో పాటు రాజకీయ కళ కూడా ఉందని దగ్గుబాటి వెంకటేశ్వర రావు అన్నారు.

అల్లుళ్లం వెన్నుపోటు పొడిచాం.. తప్పు చేశా

అల్లుళ్లం వెన్నుపోటు పొడిచాం.. తప్పు చేశా

ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రామారావు బతికి ఉంటే ప్రధాని అయ్యేవారని చెప్పారు. ఎన్టీఆర్‌కు అల్లుళ్లం వెన్నుపోటు పొడిచామని, కూతుళ్ల పాత్ర లేదని చెప్పారు. రామారావు జాతికి చిహ్నం అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి తప్పు చేశామన్నారు. జామాత దశమగ్రహం అని ఎన్టీఆర్.. చంద్రబాబును అన్నారని చెప్పారు.

డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్నారు

డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్నారు

నాడు నేను చంద్రబాబు గ్రూప్ వద్దకు వెళ్లింది.. ఎమ్మెల్యేలను అందరినీ ఎన్టీఆర్ వద్దకు తీసుకు వచ్చేందుకని దగ్గుబాటి చెప్పారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారన్నారు. అలాగే, ఎమ్మెల్యేలంతా చంద్రబాబుతో వెళ్లడంతో తాను వెళ్లానని, అలా తప్పు చేశానన్నారు. చంద్రబాబుకు బాలృష్ణ, హరికృష్ణలు సహకరించారన్నారు.

పక్కలో బల్లెం అవుతానని

పక్కలో బల్లెం అవుతానని

తాను ఉప ముఖ్యమంత్రిని అయితే పక్కలో బల్లెం అవుతానని పక్కన పెట్టారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తనను కలిసిన వారిని కూడా దూరంగా పెట్టారని చెప్పారు. దగ్గుబాటి అలుగుతాడు కానీ కమిట్‌మెంటట్ ఉన్న వ్యక్తి అని ఎన్టీఆర్ కూడా అనే వారని చెపపారు. అలిగే మనస్తత్వం కూడా తన ఎదుగుదలకు అడ్డంకిగా మారిందన్నారు. చంద్రబాబు 1989లో లోకసభకు పోటీ చేస్తానని, కుప్పం నుంచి పోటీ చేశారని చెప్పారు.

సీఎం కావాలని ముందు నుంచి బాబు ప్లాన్, నాకు రాసి పెట్టి లేదు

సీఎం కావాలనే ప్లాన్ చంద్రబాబుకు ముందు నుంచి ఉందని చెప్పారు. చంద్రబాబును చూసి తాను అసూయపడనని తెలిపారు. 1983లో టిడిపి గెలిచాక చంద్రబాబు పార్టీలో చేరారని చెప్పారు. అంతకుముందే పార్టీలోకి రమ్మని తాను అంటే.. పార్టీకి ఆదరణ ఉండదని, ఎన్టీఆర్‌కు ఓట్లు పడవని చెప్పారని తెలిపారు. నేను సీఎం కాకపోవడం తన విధి రాత అన్నారు. చంద్రబాబుకు రాసి పెట్టి ఉంది సీఎం అయ్యారని చెప్పారు.

చంద్రబాబు.. లక్ష్మీపార్వతి కారు డోర్ తీసేవారు, జూనియర్ ఎన్టీఆర్‌పై..

చంద్రబాబు.. లక్ష్మీపార్వతి కారు డోర్ తీసేవారు, జూనియర్ ఎన్టీఆర్‌పై..

లక్ష్మీపార్వతిని తాను ఎప్పుడూ దగ్గరకు తీయలేదని దగ్గుబాటి చెప్పారు. చంద్రబాబు అయితే ఆమె కారు డోర్ కూడా తీసేవారని చెప్పారు. ఎన్టీఆర్ బతికి ఉంటే రాజకీయ ముఖచిత్రమే వేరేలా ఉండేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు సినిమా కళతో పాటు రాజకీయ కళ ఉందన్నారు.

రామారావు వారసుడు బాలకృష్ణనా లేక లోకేషా అనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. ఎన్టీఆర్‌కు రాజకీయ వారసుడిగా కావాలని బాలయ్యకు కూడా ఉంటుందన్నారు. ఆ కోరిక లేకుంటే ఎమ్మెల్యే ఎలా అయ్యాడని వ్యాఖ్యానించారు. సీఎం కాకపోయినా కనీసం మంత్రి అయినా కావాలని ఉంటుందన్నారు.

పురంధేశ్వరి మదనం

పురంధేశ్వరి మదనం

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే సమయంలో పురంధేశ్వరి మదనపడ్డారని తెలిపారు. ఆమెకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. టిడిపిలో ఆగస్ట్ సంక్షోభాల గురించి తనకు తెలియదని, కానీ 2019లో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.

English summary
Daggubati Venkateswara Rao talks about Sr NTR, Jr NTR and Laxmi Parvathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X