హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా కోసం ప్రాణాలిస్తారు, ఇబ్బంది పెట్టొద్దు: దానం, ‘టిఆర్ఎస్‌ది మైండ్‌గేమ్, కిరాయినేతల పాలన’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీలో చేరాలని కోరిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారతానని పదే పదే ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు.

గ్రేటర్ పరిధి తగ్గించే ప్రయత్నాలు బాధించాయని దానం అన్నారు. సొంత పార్టీ నేతల పొమ్మనలేక పొగబెట్టారని, అవన్న వాస్తవమేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృష్టి చేస్తానని ఆయన చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ కేడర్ తనవైపే ఉందని చెప్పాని దానం నాగేందర్.. తన కోసం ప్రాణాలిస్తారని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల వ్యూహంపై మంగళవారం ఉదయం 11గంటలకు సమావేశమవుతామని దానం నాగేందర్ చెప్పారు. ఈ భేటీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఇంట్లో జరుగుతుందని చెప్పారు.

Danam Nagender on Party change

కాంగ్రెస్‌కు గ్రహణం పట్టింది: షబ్బీర్

టిఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. కిరాయి నేతలతో టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగించాలని చూస్తోందని మండిపడ్డారు. ఇది కొత్త రాష్ట్రానికి మంచిది కాదని చెప్పారు.

కొనేస్తాం, పరిపాలిస్తామని అంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చరని షబ్బీర్ అన్నారు. ఏ ఉప ఎన్నికలో గెలవని తెలుగుదేశం అధికారంలోకి రాలేదా? అనే ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గ్రహణం పట్టిందని.. త్వరలోనే మళ్లీ పుంచుకుంటామని చెప్పారు.

English summary
Congress leader Danam Nagender on Monday responded on Party change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X