ఇంట్లోకి చొరబడి నోట్లో గుడ్డలు కుక్కి డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

భీమదేవరపల్లి: తెలంగాణలోని భీమదేవరపల్లిలో ఘోరం జరిగింది. ఒంటరిగా ఉన్న యువతిపై కన్నేసిన యువకులు ఆమెపై అర్థరాత్రి వేళ సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత పెద్దమనుషులతో బేరసారాలకు ప్రయత్నించారు.

తల్లిదండ్రులు లేని డిగ్రీ విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన 13 రోజుల తర్వాత ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. హసన్‌పర్తి సీఐ రవికుమార్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని(21) తల్లిదండ్రులు మూడేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి ఆమె నానమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. విద్యార్థిని నానమ్మ అనారోగ్యం పాలు కావడంతోో అదే గ్రామానికి చెందిన పిట్టల నరేష్‌ అనే యువకుడు ఆస్పత్రికి తీసుకెళ్లేవాడు. ఈ చనువుతోనే నరేష్‌ సదరు విద్యార్థిని ఇంటికి వచ్చి వెళ్తూండేవాడు.

Degree student gang raped by her friends

ఈ నెల 4వ తేదీన పిట్టల నరేష్‌ తనకు రూ. 500 కావాలని విద్యార్థినికి ఫోన్‌ చేశాడు. డబ్బులు తీుకోవడానికి అతను ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూలేరని గమనించాడు. నరేష్‌ తన స్నేహితులైన పోలు ప్రేమకుమార్‌, బస్వ శ్రీకాంత్‌తోపాటు కలసి అదే రోజు రాత్రి ఒంటి గంట సమయంలో విద్యార్థిని ఇంటి వచ్చి తలుపు తట్టారు.

విద్యార్థిని తలుపు తీసిన వెంటనే ఆమెపై దాడి చేశారు. కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కేశారు. ముగ్గురు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తామని బెదరించారు. భయంతో ఆమె మొదట ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఆ నోటా ఈ నోటా అది బయటపడడంతో పెద్దమనుషులు రంగంలోకి దిగి బేరసారాలు జరిపారు.

సోమవారం సాయంత్రం విషయం పోలీసులకు తెలిసింది. హసన్‌పర్తి సీఐ రవికుమార్‌ ఆధ్యర్యంలో ములకనూర్‌, ఎల్కతుర్తి ఎస్‌ఐలు సంతోష్‌కుమార్‌, వెంకటరంగయ్య సూరి కొత్తపల్లి వెళ్ళారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అత్యాచారం చేసిన యువకులు పరారయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+