ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి సీబీఐ నోటీసులు: కేసీఆర్‌తో ఎమ్మెల్సీ భేటీ

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ మరో షాకిచ్చింది. 91 సీఆర్పీసీ కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో త్వరలోనే కవితను సీబీఐ విచారించనున్నట్లు తెలుస్తోంది. తాము చెప్పిన చోట, నోటీసు అందుకున్న వ్యక్తి హాజరుకావాలని .. అడిగిన పత్రాలు, ఆధారాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. తేదీ, స్థలం వివరాల గురించి త్వరలోనే మెయిల్ ద్వారా వెల్లడిస్తామని సీబీఐ పేర్కొంది.

ఏడున్నరగంటలపాటు విచారించిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ ముగిసింది. రెండు బృందాల్లో వచ్చిన సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి కవిత ఇంట్లోనే విచారణ చేపట్టారు. సుమారు ఏడున్నర గంటలపాటు విచారించిన సీబీఐ అధికారులు.. వివరాలు సేకరించారు.

సీఆర్పీసీ 160 కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా తెలిపిన ప్రకారం.. ఆదివారం ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. వారిలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు.

 Delhi liquor scam: CBI sends another notice to MLC Kalvakuntla Kavitha

సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీగా ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు.

కాగా, ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపైనే ఎక్కువ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆమెను సాక్షిగానే విచారించారు.

ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో కవిత భేటీ

కాగా, సీబీఐ విచారణ అనంతరం కవిత మంత్రి తలసాని శ్రీనివాస్, ఇతర నేతలతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. సీబీఐ విచారణకు సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్‌కు కవిత వివరించారు. ఆ తర్వాత నేరుగా ఆమె తన నివాసం చేరుకున్నారు కవిత. అయితే, సీబీఐ విచారణపై కవిత మీడియాతో మాట్లాడుతారని అంతా అనుకున్నప్పటికీ.. ఆమె స్పందించలేదు. దీనిపై ఏదైనా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+