ఢిల్లీ లిక్కర్ స్కామ్: బోయినపల్లి అభిషేక్ రావు విచారణ ఎఫెక్ట్.. మళ్ళీ 25చోట్ల ఈడీదాడులు!!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సిబిఐ దర్యాప్తు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 25 ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్న ఈడీ అధికారులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం .. మళ్ళీ దాడులు చేస్తున్న ఈడీ అధికారులు

ఢిల్లీ లిక్కర్ స్కాం .. మళ్ళీ దాడులు చేస్తున్న ఈడీ అధికారులు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాబిన్ డిస్టిలరీస్ సంస్థకు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్ళై పై కేసు నమోదు చేసిన సిబిఐ అధికారులు, రాబిన్ డిస్టిలరీస్ కు చెందిన సీసీయల్ డైరెక్టర్ అభిషేక్ రావును అరెస్టు చేసి ప్రస్తుతం విచారిస్తున్న విషయం తెలిసిందే. అభిషేక్ రావు కేసీఆర్ కు సమీప బంధువు, కల్వకుంట్ల కవిత వద్ద పీఏగా పనిచేసిన నేపద్యంలో సిబిఐ విచారణలో ఉన్న అభిషేక్ రావు ఏం చెప్తారు అన్నదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న అభిషేక్ రావు చెప్తున్న విషయాల ఆధారంగా మరోమారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మళ్ళీ దాడులు నిర్వహిస్తున్నారు.

 హైదరాబాద్ లో ఆరుచోట్ల.. దేశంలో 25 చోట్ల సోదాలు

హైదరాబాద్ లో ఆరుచోట్ల.. దేశంలో 25 చోట్ల సోదాలు

హైదరాబాద్ లోని ఆరు చోట్ల ఈరోజు తెల్లవారుజాము నుండి సోదాలు ప్రారంభించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో దేశ రాజధాని ఢిల్లీలోనూ దాడులు కొనసాగిస్తున్నారు. మొత్తం 25 ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు సాగిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కింద కవర్ చేయబడిన ప్రాంతాలన్నీ మద్యం డీలర్ షిప్ మరియు డిస్ట్రిబ్యూషన్ లో అనుసంధానించబడిన ప్రైవేటు సంస్థలకు చెందినవని అధికారులు పేర్కొన్నారు.

లిక్కర్ స్కాం లో ఉన్న వారి వ్యాపారాలపై, ఆర్ధిక లావాదేవీలపై దర్యాప్తు

లిక్కర్ స్కాం లో ఉన్న వారి వ్యాపారాలపై, ఆర్ధిక లావాదేవీలపై దర్యాప్తు

ఇప్పటికే ఈ కేసులో గత నెల లో మద్యం వ్యాపారవేత్త మరియు మద్యం తయారీ కంపెనీ ఇండో స్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేశారు. మద్యం ఎక్సైజ్ పాలసీ 2021 2022 అమలులో జరిగిన అవకతవకలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణకు సిఫార్సు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 11 మంది ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నదని అనుమానిస్తున్న వారి వ్యాపారాలపై, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు సాగిస్తున్నారు.

బోయినపల్లి అభిషేక్ రావు కస్టడీ మరో రెండురోజులు పొడిగింపు .. ఏం జరుగుతుందో?

బోయినపల్లి అభిషేక్ రావు కస్టడీ మరో రెండురోజులు పొడిగింపు .. ఏం జరుగుతుందో?

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురి పేర్లు ఈ కుంభకోణంలో వెలుగులోకి రావడం అటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కెసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువ కాగా, కవిత కు అత్యంత సన్నిహితంగా ఉన్న వారిని ఈ కేసులో అరెస్టు చేసి విచారిస్తుండడం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. బోయినపల్లి అభిషేక్ రా ను విచారిస్తున్న సీబీఐ అధికారులు మరో రెండు రోజుల పాటు ఆయనను కస్టడీ పొడిగింపు నేపథ్యంలో ఈ కేసులో ఆయన ఏం చెబుతారు అన్నది కీలకంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బోయినపల్లి అభిషేక రావు పాత్ర కీలకంగా ఉండటంతోనే ప్రస్తుతం ఈ వ్యవహారంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో అన్న ప్రకంపనలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+