ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ ఛార్జీషీటులో మరోసారి కల్వకుంట్ల కవిత పేరు
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ఛార్జీషీటు దాఖలు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ). తాజాగా, ఈడీ దాఖలు చేసిన ఛార్జీషీటులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి చేర్చింది. కవిత వాడిన పది మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఛార్జీషీటులో పేర్కొంది.
కవితతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తం గౌతమ్, అరుణ్ రామ చంద్రపిళ్లై, అభిషేక్ రావు పేర్లను ఛార్జీషీటులో ఈడీ ప్రస్తావించింది. ఒబారాయ్ హోటల్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు ఈడీ విచారణలో పేర్కొన్నారు సమీర్ మహేంద్రు. శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్, బుచ్చిబాబు ఢిల్లీ ఒబారాయ్ హోటల్ సమీర్ మహేంద్రు కలిసినట్టు ఈడీ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.
ఈ సమావేశంలో కవిత కూడా ఉన్నట్లు తెలిపింది. అంతేగాక, సమీర్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా ఉందని పేర్కొంది. మాగుంట శ్రీనివాసులురెడ్డికి కూడా ఈ కంపెనీలో వాటా ఉందని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం వల్ల ఇండో స్పిరిట్ కంపెనీకి అక్రమంగా రూ.192.8 కోట్లు లాభం వచ్చిందని చార్జిషీట్ లో ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాం కుట్ర ద్వారా సంపాదించిన ఈ ఆదాయంలో ఎక్కువ భాగం కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డికే పోయిందని ఆరోపించింది.
అలాగే, ఇండో స్పీరిట్స్‌లో ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవిత కు వాటా ఉన్నట్లు ఈడీ పేర్కొంది.

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది.మూడు వేలపేజీలతో కూడినమొదటి ఛార్జీషీటును ఈడీ నవంబర్ 26న దాఖలు చేసింది. ఛార్జిషీర్జి ట్లోని అం శాలను పరిశీలించిన కోర్టు వాటిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది.
ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొ న్న నిందితులు.. సమీర్ మహేంద్రు, ఆయనకు చెందిన నాలుగు మద్యం సరఫరా తయారీ సంస్థలస్థకు సమన్లు జారీ చేసింది. ఛార్జిషీర్జి ట్లో పేర్కొ న్న అంశాలపై తమ అభిప్రాయాలను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సమీర్ మహేంద్రు
దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నం దని కోర్టు తెలిపింది.
విచారణ జనవరి 3కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా చేరుస్తూ 10వేల పేజీలతో కూడిన సీబీఐ దాఖలు చేసిన మొదటి ఛార్జిషీట్ ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. అందులో పేర్కొ న్న ఏడుగురు నిందితులకు సమన్లు జారీ చేయడం సహా అంతా ట్రైయల్ ఎదుర్కోవాల్సిం దేనని అందుకు తగిన పూర్తి ఆధారాలు ఛార్జిషీర్జి ట్లో సీబీఐ స్పష్టం చేసిందని ప్రత్యేక కోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications