కాళ్లు, చేతులు కట్టేసి.. హైదరాబాద్‌లో ఢిల్లీ యువతిపై రేప్

హైదరాబాద్‌: నగర పర్యటనకు వచ్చిన ఢిల్లీ యువతి ఒకరు అత్యాచారానికి గురయ్యారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ ఘటనపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన యువతి(20) తన స్నేహితులతో కలిసి ఆగస్టు 13న హైదరాబాద్ పర్యటనకు వచ్చింది. బంజారాహిల్స్ రోడ్డు నెం. 10లోని వోయో హోటల్‌లో బస చేసింది. ఆగస్టు 15న రాత్రి 9గంటల సమయంలో నగర సందర్శన అనంతరం ఆమె హోటల్ తిరిగి వచ్చింది.

లిఫ్టులో తన గదికి వెళుతుండగా.. అదే హోటల్‌లో బస చేస్తున్న నలుగురు యువకులు యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. తమ గదికి రావాలంటూ బెదిరించారు. ఎలాగో వారి నుంచి తప్పించుకుని ఆమె తన గదిలోకి వెళ్లింది.

Delhi tourist raped in Hyderabad hotel room

కాగా, మరుసటి రోజు తెల్లవారుజామున 4గంటలకు సర్వీస్ బాయ్‌నంటూ ఆ నలుగురు యువకులలో ఓ యువకుడు యువతి గది తలుపు తట్టాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లాడు. ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత యువతి కాళ్లు, చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు.

నిందితుడికి మరో ముగ్గురు యువకులు సహకరించారు. ఈ మేరకు బాధితురాలు గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నగరానికి వచ్చిన నాటి నుంచీ యువతిని వెంబడించిన ఆ యువకుడు.. ఆమె చేసిన హోటల్ తెలుసుకుని అక్కడే మకాం వేసినట్లు తెలిసింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

నలుగురు నిందితుల అరెస్ట్, తుపాకీ స్వాధీనం

కాగా, హోటల్ లో రూం బాయ్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా.. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నలుగురూ హోటల్ సిబ్బందేనని తేలింది. దీంతో ఆ నలుగురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+