డీలిమిటేషన్ రాజ్యాంగ బద్ధమైన ప్రక్రియ: ‘సౌత్-నార్త్’పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జూన్ 2, 3 తేదీల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండ్రోజుల కార్యక్రమాలను మీడియాకు వివరించారు. వివిధ రాజ్‌భవన్‌లలో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నట్లు తెలిపారు.
రానున్న రోజుల్లో రాష్ట్రాల ఆవిర్భావ వేడుకలను దేశ వ్యాప్తంగా ఉన్న రాజ్‌భవన్ లలో జరపనున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారని. అందుకే తెలంగాణ సాకారమైందన్నారు. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం రంగాల వారీగా గత తొమ్మిదేళ్లలో కేంద్రం ప్రభుత్వం ఏం చేసిందో ప్రకటిస్తామని తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం కేంద్రం అనేకసార్లు సమావేశాలు నిర్వహించిందని, సామరస్యపూర్వకంగానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఢిల్లీ ఏపీ భవన్ విభజనపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. బీజేపీలో చేరిన ఎవరూ బయటికి వెళ్లరని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీలో నాయకులు చేరితే ప్రభుత్వాలు ఏర్పడవని.. ప్రజలు మార్పు కోరుకుంటేనే ప్రభుత్వాలు ఏర్పడతాయని కిషన్ రెడ్డి చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడలేదని.. బీజేపీ నిరాశ, నిస్పృహకి లోనయ్యే పార్టీ కాదన్నారు. అనేకమంది నాయకులు బీజేపీలో కొత్తగా చేరబోతున్నారన్నారు. కాంగ్రెస్ బలంగా ఉండాలనే బీజేపీపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోడీకి నార్త్, సౌత్ అని తేడా ఉండదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సౌత్ , నార్త్ అంటూ విభేదాలు సృష్టించవద్దని కోరారు. దక్షిణాది నుంచి కూడా ప్రధానులు అయ్యారని చెప్పారు.
బీజేపీ జాతీయ భావజాలంతో పనిచేస్తుందన్నారు. డీలిమిటేషన్ రాజ్యాంగ బద్ధమైన ప్రక్రియ అని.. ఇప్పటికిప్పుడు జరుగుతుందని చెప్పలేమన్నారు. రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనడం సరికాదన్నారు. కాగా, ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని మంగళవారం మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి ఈ మేరకు స్పందించడం గమనార్హం.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం











Click it and Unblock the Notifications