'టార్చ్‌లైట్' వెలుగులో డెలివరీ.. ఖమ్మంజిల్లా పిహెచ్‌సిలో వైద్యులచొరవ సంతోషమే కానీ బిగ్ క్వశ్చన్ ఇదే!!

శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లోనూ టార్చ్ లైట్ వెలుతురులో డెలివరీలు చేయాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం ఆస్పత్రులలో విద్యుత్ సరఫరా, పవర్ బ్యాకప్ పై దృష్టి సారించటం లేదు అన్న భావన ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలతో కలుగుతుంది.

టార్చ్ లైట్ల వెలుగులో రోగులకు వైద్య సేవలు అందిస్తున్న పీహెచ్సీలు

టార్చ్ లైట్ల వెలుగులో రోగులకు వైద్య సేవలు అందిస్తున్న పీహెచ్సీలు

భారీ వర్షాల కారణంగా వివిధ ఆసుపత్రుల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆస్పత్రిలో వైద్యులు, వైద్యం కోసం వచ్చిన రోగులకు టార్చ్ లైట్ వెలుతురులో సేవలందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఖమ్మం జిల్లాలో పెనుబల్లి మండలం పరిధిలోని అడవిమల్లెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎడ్ల బంజర్ గ్రామం నుండి పురుటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణీ మహిళకు టార్చ్ లైట్ వెలుతురులో డెలివరీ చేసిన ఘటన చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లాలో మహిళకు సెల్ ఫోన్ టార్చ్ తో డెలివరీ చేసిన వైద్యులు

ఖమ్మం జిల్లాలో మహిళకు సెల్ ఫోన్ టార్చ్ తో డెలివరీ చేసిన వైద్యులు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పరిధిలోని అడవిమల్లెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో పెనుబల్లి మండల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీనికితోడు ఆస్పత్రిలో ఉన్న ఇన్వర్టర్ కూడా ఆన్ కాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన దుర్గాభవాని అనే మహిళకు సెల్ ఫోన్ టార్చ్ వెలుతురులో డెలివరీ చేశారు వైద్యులు.

వైద్యుల చొరవ ఓకే ... కానీ ఆస్పత్రిలో మౌలిక వసతులపై ఉత్పన్నం అవుతున్న ప్రశ్నలు

వైద్యుల చొరవ ఓకే ... కానీ ఆస్పత్రిలో మౌలిక వసతులపై ఉత్పన్నం అవుతున్న ప్రశ్నలు

ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బందికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ సరఫరా లేకుండా డెలివరీ చేసి తల్లి, బిడ్డను కాపాడారని పలువురు ప్రశంసిస్తున్నారు. అత్యవసర పరిస్థితులలో వైద్యుల చూపించిన చొరవ ప్రశంసనీయమైనదే కానీ తెలంగాణలో ఆసుపత్రుల పరిస్థితి ఇలా ఉందంటూ పలువురు విమర్శిస్తున్నారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది, టార్చ్ లైట్ వెలుతురులో ఏదైనా తేడా జరిగితే పరిస్థితి ఏంటి అన్న చర్చ జరుగుతుంది.

గతంలోనూ ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే.. చెన్నూరు పీహెచ్సీలో టార్చ్ వెలుగులో డెలివరీ

గతంలోనూ ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే.. చెన్నూరు పీహెచ్సీలో టార్చ్ వెలుగులో డెలివరీ

ఇక ఇదే తరహాలో ఏప్రిల్ నెలలో వైద్యులు గర్భిణీ మహిళకు ఖమ్మంలోని చెన్నూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సి)లో ఈదురు గాలులతో కూడిన వాతావరణం కారణంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడటంతో 'ఛార్జింగ్ లైట్లు' ఉపయోగించి ఆరోగ్య కార్యకర్తలు డెలివరీ చేశారు. డెలివరీ చేస్తున్న సమయంలో కరెంటు ఉందని, అయితే మధ్యలో కరెంటు పోవడంతో టార్చ్ లైట్ లను ఉపయోగించి డెలివరీ చేసినట్లుగా వైద్యాధికారులు చెప్పారు. అప్పుడు కూడా ఆసుపత్రులలో విద్యుత్ సరఫరా, కరెంట్ బ్యాకప్ పై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+