ఎండల దెబ్బకు బీర్లకు డిమాండ్.. తెలంగాణాలో రోజుకు ఎంత తాగుతున్నారో తెలుసా?

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ సంవత్సరం ఎండలు బాగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ఈ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి చాలామంది చల్ల చల్లని బీర్ లను ఆశ్రయిస్తున్నారు. ఎండల దెబ్బను తట్టుకోవాలంటే బీర్ తాగాల్సిందే అని భావిస్తున్న మద్యం ప్రియులు కేసులకు కేసులు బీర్లు ఖాళీ చేస్తున్నారు.

తెలంగాణలో డిమాండ్ కు తగ్గట్టు బీర్ల ఉత్పత్తి
రాష్ట్రంలో సమ్మర్ సీజన్లో బీర్ లకు షార్టేజ్ లేకుండా డిమాండ్ కు తగ్గట్టుగా ప్రొడక్షన్ చేయాలని ప్రభుత్వం బేవరేజెస్ కంపెనీస్ కి ఇంతకుముందే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకపక్క ప్రజల డిమాండ్ కు తగ్గట్టు బీర్ల ఉత్పత్తి సంస్థలు సప్లై చేసేందుకు బీర్ల ఉత్పత్తిని పెంచినప్పటికీ రాష్ట్రంలో మాత్రం వైన్స్ లో, బార్ షాపులలో బీర్లు క్షణాలలో విక్రయం అవుతున్నాయి.

Demand for beer in telangana in summer Do you know how much beer is drunk per day

భారీగా పెరిగిన బీర్ల అమ్మకాలు
ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ కూడా జోరుగా సాగుతున్న క్రమంలో వివాహ వేడుకలకు సంబంధించిన పార్టీలకు కూడా బీర్ల వినియోగం పెరిగింది. రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు భారీగా పెరగడంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుంది. ఈ సీజన్లో ఎక్సైజ్ శాఖ అంచనాలకు తగ్గట్టు భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గతేడాది కంటే కోటిన్నర కేసుల బీర్లు ఎక్కువగా అమ్మాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.

ప్రతీరోజూ ఎంత తాగుతున్నారంటే
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు మూడు లక్షల బీర్ కేసులు అవుతున్నాయని సమాచారం. ఈ సీజన్ తప్ప మిగతా సాధారణ రోజులతో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయిలో ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ దాదాపు 5.48 కోట్ల కేసుల బీర్లు అమ్మితే, ఈ సంవత్సరం ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గతేడాది కంటేఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం
ఏది ఏమైనప్పటికీ ప్రతిరోజు 3లక్షల బీర్ కేసులు అమ్ముడవుతున్నాయి అంటే మన వాళ్ళు ఏ రేంజ్ లో బీర్ లను ఖాళీ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పోటీ పడి మరీ బీర్లు తాగేస్తున్న మందు బాబులు ఈ సీజన్ లో గతేడాది కంటే ఎక్కువ ఆదాయాన్నే ప్రభుత్వానికి అందించేలా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+