Bhatti: ఓ కంపెనీ లబ్ధి కోసమే ఫార్ములా ఈ-రేస్.. భట్టి విక్రమార్క..

ఫార్ములా ఈ రేస్ రద్దుపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ఓ కంపెనీకి లబ్ధి చేకుర్చడానికే ఫార్ములా ఈ రేస్ నిర్వహించారని చెప్పారు. బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. ఈ ఫార్ములా రేసుతో రాష్ట్రానికి వచ్చే లాభం ఏమిటో చెప్పాలన్నారు. ఈ రేసుకు రూ.110 కోట్లు కట్టారని చెప్పారు. ఫార్ముల ఈ-రేసు రద్దుపై ఇష్టం వచ్చినట్లు ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు.

మాజీ మంత్రుల వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని.. ప్రతిపైసా ప్రజల అవసరాల కోసమే ఖర్చు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అయింది. అంతే కాకుండా ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలంటే ప్రభుత్వం రూ.200 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతోనే ప్రభుత్వం ఫార్మలా ఈ రేస్ నిర్వహణకు విముఖత చూపింది.

Deputy CM Bhatti said that Formula E-Race was organized to benefit a company

గతంలో ఫార్ము ఈ రేస్ కోసం ప్రభుత్వం దాదాపు రూ.200 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. అయితే ఫార్మలా ఈ రేస్ కోసం సిటీ శివారులో ట్రాక్ ఏర్పాటు చేస్తే శాశ్వతంగా ఉండిపోయేది. ఎవరికి ఇబ్బంది ఉండకపోయేది. కానీ ట్యాంక్ బండ్ నిర్వహించడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈ ఈవెంట్ ను నిర్వహించడానికి ఇష్టపడలేదు. దీంతో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమెబైల్స్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. గత ప్రభుత్వంతో రేసు నిర్వహణ కోసం అక్టోబర్ 23న చేసుకున్న ఒప్పందాన్ని.. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ శాఖ రద్దు చేసినట్లు వివరించింది.

ఫార్ముల ఈ రేస్ రద్దు కావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. దీన్ని కాంగ్రెస్ తీసుకున్న తిరోగమన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడితే హైదరాబాద్ తో పాటు దేశం ఇమేజ్ కూడా పెరుగుందన్నారు. గతంలో హైదరాబాద్‌‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా మార్చడానికి దీన్ని ఉపయోగించుకున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈవీ ఔత్సాహికులు, తయారీదారులు స్టార్టప్‌‌లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్‌‌ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్‌‌ను వినియోగించుకుందని చెప్పారు. దీనిపై తాజాగా భట్ట స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+