దేశ్ కీ నేత కేసీఆర్.. పూరీతీరంలో కేసీఆర్ సైకతశిల్పం; టీఆర్ఎస్ పబ్లిసిటీ స్టంట్స్ షురూ!!

తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి గత రెండు పర్యాయాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలను మలుపు తిప్పుతారా? జాతీయ పార్టీని స్థాపించి, దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి బిజెపికి ప్రత్యామ్నాయంగా బలమైన రాజకీయ కూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్న కెసిఆర్ తన ప్రయాణంలో సక్సెస్ అవుతారా? దేశ్ కి నేత కెసిఆర్ అని ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న క్రమంలో నిజంగా ఆయన దేశ్ కి నేత గా గుర్తింపు తెచ్చుకుంటారా? అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

 జాతీయ నాయకుడిగా కేసీఆర్ ను చూపించే పనిలో గులాబీ నేతలు

జాతీయ నాయకుడిగా కేసీఆర్ ను చూపించే పనిలో గులాబీ నేతలు


సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ఉవ్విళ్ళూరుతున్న క్రమంలో, పెద్ద ఎత్తున ప్రచారం పైన కూడా దృష్టి సారిస్తున్నట్టు తెలిసిన విషయమే. గతంలోనే అనేక రాష్ట్రాలలో సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాలలోకి స్వాగతం అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కొందరు అభిమానం వ్యక్తం చేసుకున్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం కెసిఆర్ ని జాతీయ నాయకుడిగా చూపించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు.

పూరీ తీరంలో కేసీఆర్ సైకత శిల్పం ఏర్పాటు చేయించిన టీఆర్ఎస్ నేత

పూరీ తీరంలో కేసీఆర్ సైకత శిల్పం ఏర్పాటు చేయించిన టీఆర్ఎస్ నేత

ఇక తాజాగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మరింత పట్టు బిగించడం కోసం దసరా పండుగ రోజున జాతీయ పార్టీని ప్రకటిస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ ఆయన సైకత శిల్పాన్ని పూరి తీరంలో ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ ఆధ్వర్యంలో సైకతశిల్పి సాహు దీనిని రూపొందించారు. ఈ సైకత శిల్పంలో కేసీఆర్ బొమ్మను చిత్రీకరించి దేశ్ కీ నేత, కిసాన్ కీ భరోసా అంటూ రాశారు.

దేశ గతిని మార్చే నాయకుడికి జాతీయ రాజకీయాలకు స్వాగతం చెప్పేందుకే సైకత శిల్పం

దేశ గతిని మార్చే నాయకుడికి జాతీయ రాజకీయాలకు స్వాగతం చెప్పేందుకే సైకత శిల్పం


14 సంవత్సరాల పాటు అలుపెరుగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే మార్గదర్శిగా తీర్చిదిద్దారని, ఆయన దేశ రాజకీయాల్లోకి వస్తే దేశ భవిష్యత్తును మార్చే సత్తా ఉన్న నాయకుడని తెలియజేసే క్రమంలోని ఈ సైకత శిల్పాన్ని రూపొందించినట్టుగా అరవింద్ తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్న సమయంలో దేశ గతిని మార్చడం కోసం నడుంబిగించిన తమ నాయకుడికి వినూత్నరీతిలో ఆహ్వానం పలకడం కోసం సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించినట్టుగా అరవింద్ వెల్లడించారు.

పూరీలో కేసీఆర్ పార్టీపై స్థానికంగా చర్చ ... గులాబీ నేతల టార్గెట్ అదే

పూరీలో కేసీఆర్ పార్టీపై స్థానికంగా చర్చ ... గులాబీ నేతల టార్గెట్ అదే

ఇక పూరీలోని స్థానికులు, పర్యాటకులు ఆ సైకత శిల్పాన్ని సందర్శించడంతో పాటుగా, కెసిఆర్ రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు. అక్కడ వారిలో కేసీఆర్ పేరు చర్చకు రావటం కోసం ఇది టీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీగా కనిపిస్తుంది. మొత్తానికి సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందే దేశవ్యాప్తంగా తన శ్రేణుల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టు తాజా పరిణామాలతో అర్థమవుతుంది.

దేశ్ కీ నేత కేసీఆర్ .. గులాబీల స్ట్రాటజీపై మండిపడుతున్న ప్రతిపక్షాలు

దేశ్ కీ నేత కేసీఆర్ .. గులాబీల స్ట్రాటజీపై మండిపడుతున్న ప్రతిపక్షాలు

కేసీఆర్ ను దేశ్ కి నేత గా చూపించే ప్రయత్నాలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక దేశవ్యాప్తంగా మరెన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారో అన్న ఆసక్తి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకోవటం లేదని, తమను తాము హైలెట్ చేసుకోవటం కోసం కేసీఆర్ ఈ తరహా పబ్లిసిటీ స్టంట్ లకు దిగుతున్నారని మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+