వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామారెడ్డి జిల్లాలో పంజా విసురుతున్న అతిసార వ్యాధి .. భయం గుప్పెట్లో ప్రజలు

|
Google Oneindia TeluguNews

కామారెడ్డి జిల్లాలో అతిసార వ్యాధి ప్రబలుతోంది. మూడు గ్రామాల ప్రజలను ఆస్పత్రుల పాలు చేసింది. గ్రామాల్లోకి తాగునీరు సరఫరా చేసే మిషన్ భగీరద పైప్ లైన్ లీకేజ్ వల్ల నీరు కలుషితమై మూడు గ్రామాలకు సరఫరా కాగా ఆ నీరు తాగిన గ్రామ ప్రజలు అతిసారతో బాధపడుతూ ఆసుపత్రుల బాట పట్టారు.

కామారెడ్డి జిల్లాలో విషాదం..కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి, 90 మందికి అస్వస్థత కామారెడ్డి జిల్లాలో విషాదం..కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి, 90 మందికి అస్వస్థత

 అతిసార వ్యాధికి ముగ్గురు బాలి.. మూడు గ్రామాల్లో కలుషిత నీరు తాగటం వల్లే అతిసార వ్యాధి

అతిసార వ్యాధికి ముగ్గురు బాలి.. మూడు గ్రామాల్లో కలుషిత నీరు తాగటం వల్లే అతిసార వ్యాధి

నిన్నటికి నిన్న ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ అతిసార వ్యాధితో మృత్యువాత పడ్డారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.

కలుషిత నీరు తాగడం వల్ల కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం మగ్దుం పూర్, కోమలంచ , గాలిపూర్ గ్రామాలలో చాలా మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కోమలంచ గ్రామంలో రిషిత అనే చిన్నారి, మగ్దూం పూర్ కు బంధువుల ఇంటికి వచ్చిన అన్నారం కలాన్ గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే బాలుడు, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. మగ్దూం పురం బంధువుల ఇంటికి వచ్చి సునీత అనే మహిళ సైతం అతిసార బారిన పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

అతిసార బారినపడిన వారికి మెడికల్ క్యాంపులు ..అప్రమత్తం అయిన వైద్యాధికారులు

అతిసార బారినపడిన వారికి మెడికల్ క్యాంపులు ..అప్రమత్తం అయిన వైద్యాధికారులు


ఇక దాదాపు ఈ మూడు గ్రామాలలో 68 మంది అతిసార బారినపడి పొందుతున్నారు. ఈ వ్యాధి ప్రబలకుండా ఉండటం కోసం వైద్యాధికారులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. కోమలంచ గ్రామంలో వ్యాధి సోకిన వారికి గ్రామంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలోనే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన మరికొంత మందితోపాటు మగ్దుంపూర్‌, గాలిపూర్‌ గ్రామాలకు చెందిన పలువురు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతిసార వ్యాధితో ఇంకెవరు మృతి చెందకుండా ఉండేలా అప్రమత్తమైన అధికారులు గ్రామస్తులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మిషన్ భగీరధ పైప్ లైన్ లీకేజీలు తక్షణ మరమ్మత్తు చెయ్యాలని అధికారులకు ఆదేశం

మిషన్ భగీరధ పైప్ లైన్ లీకేజీలు తక్షణ మరమ్మత్తు చెయ్యాలని అధికారులకు ఆదేశం

మిషన్‌ భగీరథ నీరు సరఫరా అయ్యే పైప్‌లైన్‌ పూర్తిగా లీకేజీ కావడంతో నీరు కలుషితమై ఈ పరిస్థితి తలెత్తిందని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. దీంతో పైప్‌లైన్‌ లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని మిషన్‌ భగీరథ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ మూడు గ్రామాల్లోని ప్రజలు మంచినీళ్లు తాగాలి అంటేనే భయపడుతున్నారు. విపరీతంగా ప్రబలిన అతిసార వ్యాధితో భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.

English summary
Three persons including two children and a woman died at the Banswada area hospital on Tuesday, while undergoing treatment for diarrhea. Sunitha (33), a resident of Mujrampet village in Medak district had gone to Magdoompoor village in Nizamsagar mandal to participate in oora pandaga. After the event, nearly 100 people ate meat and about 30 people were admitted at the Banswada area hospital after complaining of vomiting and diarrhea. Officials at the hospital said that Sunitha died on Tuesday morning and added that consumption of contaminated food, water led to diarrhea.In a similar case, nearly 20 persons belonging to Komalancha village also complained of vomiting and motions and were admitted to the Banswada area hospital on Sunday morning. Nishitha (3) was one among them undergoing treatment at the Banswada hospital. She was referred to Niloufer Hospital in Hyderabad for better treatment, but died while she was being taken to the hospital. Another boy, Satyanarayana (6), also died while undergoing treatment at GGH hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X