అల్లు అర్జున్ అబద్దాలు చెప్పారా ? రోడ్ షో వీడియోల వైరల్..!

పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కు కుటుంబంతో పాటు వెళ్లి అక్కడ తొక్కిసలాట, ఓ మహిళ మృతి, ఆమె కుమారుడు ఆస్పత్రిపాలు కావడానికి కారణమైన హీరో అల్లు అర్జున్ నిన్న మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ ఘటనను పిన్ టూ పిన్ వివరించిన తర్వాత అల్లు అర్జున్ రాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కామెంట్స్ కు వివరణ ఇచ్చారు. అయితే ఇందులో ఆయన చెప్పిన విషయాలపై చర్చ జరుగుతోంది.

నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తన చిత్రం పుష్ప2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల్ని పూసగుచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు చేరుకునే క్రమంలో చేసిన రోడ్ షో నుంచి మొదలుపెట్టి థియేటర్ లోకి ఎంటరైన తర్వాత కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేయడం, ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడు అపస్మారక స్ధితిలోకి వెళ్లాలని తెలిసిన తర్వాత కూడా థియేటర్ లోనే ఉండిపోవడాన్ని ప్రశ్నించారు.

did allu arjun tell lies on pushpa 2 movie release stampede road show real footage viral

ఆ తర్వాత పోలీసులు థియేటర్ లోకి వచ్చి అల్లు అర్జున్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో తిరిగి వెళ్లిపోవడం వరకూ రేవంత్ రెడ్డి అన్నీ పూసగుచ్చినట్లు వివరించారు. దీనిపై నిన్న సాయంత్రం ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ అసలు తాను రోడ్ షోనే చేయలేదని, థియేటర్లో జనం అడ్డుగా ఉండటంతో వారికి అభివాదం చేస్తూ తప్పుకోవాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. అయితే అల్లు అర్జున్ చెప్పిన విషయాలు కరెక్ట్ కాదని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు నిరూపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న వీడియోల్లో అల్లు అర్జున్ ముషీరాబాద్ ఫ్లై ఓవర్ నుంచి సంధ్య థియేటర్ వరకూ తన కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానుల్ని పలకరిస్తూనే వచ్చారని తేలిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఫ్లై ఓవర్ కింద భారీ ఎత్తున తరలివచ్చిన జనం కూడా ఈ వీడియోల్లో కనిపిస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ చెప్పిన విషయాలన్నీ అబద్ధాలే అని అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+