దారితప్పిన బీఆర్ఎస్, కవిత వర్సెస్ కేటీఆర్.. కేసీఆర్ చేతులెత్తేసినట్టేనా?

బిఆర్ ఎస్ పార్టీ దారి తప్పిందా? బీఆర్ఎస్ పార్టీలో కవిత కేటీఆర్ ల మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధాన్ని కెసిఆర్ ఆపలేకపోయారా? కవిత పైన సస్పెన్షన్ వేటు వేసి పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చారా? కవిత వేరే కుంపటి పెడితే బిఆర్ఎస్ పార్టీకి నష్టం కాదా? స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కవిత వ్యవహారంలో కెసిఆర్ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం పార్టీ కొంప ముంచుతుందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

కేసీఆర్ గీత దాటిన సొంత బిడ్డలు
ఒకప్పుడు కెసిఆర్ గీసిన గీత దాటని బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు కెసిఆర్ మాటకు విలువ లేదు అన్న భావన కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఒక్క మాట చెబితే ఆగాల్సిన చోట కన్న బిడ్డలే కయ్యానికి కాలు దువ్వి పార్టీని నాశనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు కెసిఆర్ ఏది చెబితే అదే శాసనం, కానీ ఇప్పుడు కెసిఆర్ చెప్పిన మాట కూతురే వినే పరిస్థితి లేదు.

Did KCR give up hopes on BRS kavitha and ktr have ruined the party

Take a Poll

కొడుకు, కూతురును కంట్రోల్ చెయ్యలేని కేసీఆర్
కొడుకు కేటీఆర్ కి కూడా కెసిఆర్ చెప్పలేకపోతున్నాడు అన్న భావన తాజా పరిస్థితులతో కనిపిస్తుంది. కేటీఆర్ చెప్పిన దానికి తలూపటమే తప్ప సొంత నిర్ణయాలు అధినేత తీసుకోలేకపోతున్నారన్న చర్చ కూడా సాగుతుంది. పార్టీలో కోవర్టులు ఉన్నారని కవిత నోరు తెరిచిన నాడే కవితను పిలిచి వివాదానికి చెక్ పెట్టాల్సిన అధినేత కేసీఆర్ ఆ పని చెయ్యలేదు. ఫలితంగా కవిత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు.

పదేపదే వారిని టార్గెట్ చేసిన కవిత
కవిత కెసిఆర్ మంచోడే, ఆయన చుట్టూ ఉండే వాళ్ళే దుష్ట గ్రహాలు, దెయ్యాలు, రాక్షసులు అంటూ సంతోష్ తదితరులను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పి సి ఘోష కమిషన్ నివేదిక పై అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత సిబిఐ ఎంక్వయిరీకి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించడంతో కవిత హరీష్ రావును, సంతోష్ ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కు పార్టీ పై గ్రిప్ లేదు
కెసిఆర్ పై సిబిఐ ఎంక్వయిరీ అంటే తనకు ఒళ్ళు మండి పోతుందని, దీనంతటికీ కారణం హరీష్ రావే అని ఆమె టార్గెట్ చేశారు. కవిత వ్యాఖ్యలతో సీరియస్ స్టెప్ తీసుకున్న అధినేత బి ఆర్ ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయితే ఈ వ్యవహారం అంతా కెసిఆర్ కు పార్టీ పైన గ్రిప్ లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది.

కేసీఆర్ చేతులెత్తేశారా?
కొడుకును, కూతుర్నే కంట్రోల్ చేయలేని కేసీఆర్, పార్టీని ఏ విధంగా కంట్రోల్ చేస్తాడు అన్న అభిప్రాయానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా దశాబ్దకాలం అప్రతిహతంగా తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా పాలన సాగించిన కేసీఆర్ ప్రస్తుతమున్న పరిస్థితులతో చేతులెత్తేసినట్టు కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తీసుకున్న ఈ నిర్ణయం బిఆర్ఎస్ పార్టీని నిండా ముంచేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ దారి తప్పిందా? కేసీఆర్ ఏం చేస్తారు ?
బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయిందని, పార్టీ దారి తప్పిందని, అధినేత చేతుల్లో ఏమీ లేదు అన్న సంకేతాలు పార్టీ శ్రేణుల దాకా వెళుతున్నాయి. గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్, అధినేత కెసిఆర్ ఈ పరిస్థితుల నుంచి బయట పడతారా? మళ్లీ పార్టీని దూకుడుగా ముందుకు తీసుకు వెళ్ళ గలుగుతారా? అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+