Harish Shankar: మన బటన్ మనమే నొక్కాలి.. హరీశ్ శంకర్ సంచలన ట్వీట్..
స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. "రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన నాయకులు కాదు. సంపాదించింది రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఖర్చుపెట్టిన నాయకున్ని గుర్తించండి.
ఎవరో బటన్ నొక్కితే బతికే కర్మ మనకు లేదు. మన బటన్ మనమే నొక్కాలి. అదే ఈరోజు ఈవీఎం బటన్ అవ్వాలి. ఓటు మన హక్కు మాత్రమే కాదు మన బాధ్యత కూడా" అని ట్వీట్ చేశారు.
రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన నాయకులు కాదు
— Harish Shankar .S (@harish2you) May 13, 2024
సంపాదించింది రాజకీయాల్లోకి వచ్చి
ప్రజల కోసం ఖర్చుపెట్టిన
నాయకున్ని గుర్తించండి
ఎవరో బటన్ నొక్కితే బతికే కర్మ మనకు లేదు
మన బటన్ మనమే నొక్కాలి
అదే
ఈరోజు ఈవీఎం బటన్ అవ్వాలి
ఓటు మన హక్కు మాత్రమే కాదు
మన బాధ్యత కూడా .…
హరీశ్ శంకర్ పరోక్షంగా పవన్ కల్యాణ్ సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేశారు. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ ను కూడా పరోక్షంగా విమర్శించారు. హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలోని ఓ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం డైలాగు జనల్లో పాఫులర్ అయింది.













Click it and Unblock the Notifications