హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేటితో ముగియనున్న పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్: రేపటినుండి యధావిధిగా ఫైన్లు; త్వరపడండి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సర్కార్ ప్రకటించిన పెండింగ్ చలాన్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఈ రోజుతో ముగియనుంది. దీంతో వాహనదారులు పెండింగ్ చలాన్స్ ఉంటే త్వరపడాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు వేసిన చలాన్స్ చెల్లింపులో నిర్లక్ష్యం చూపిస్తున్న వాహనదారుల నుండి పెండింగ్ చలాన్స్ వసూలు చేయడం కోసం ఆలోచన చేసిన తెలంగాణ ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఊహించని విధంగా పెండింగ్ చలాన్స్ కట్టడం కోసం వాహనదారులు పోటీ పడ్డారు.

 నేటితో ముగియనున్న డిస్కౌంట్ ఆఫర్ గడువు

నేటితో ముగియనున్న డిస్కౌంట్ ఆఫర్ గడువు

మొదట మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించారు. అయితే వాహనదారుల నుండి చెల్లింపుల కోసం వెబ్ సైట్ రద్దీ ఎక్కువ ఉండడంతో పాటు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 15వ తేదీ వరకు గడువు పెంచుతున్నామని హోంమంత్రి మహబూబ్ అలీ వెల్లడించారు. అయితే పొడిగించిన గడువు ఈరోజుతో ముగియనుంది.

రేపటి నుంచి చలాన్ల పై వున్న రుసుము యధావిధిగా

రేపటి నుంచి చలాన్ల పై వున్న రుసుము యధావిధిగా

డిస్కౌంట్ ఆఫర్ కు నేడే చివరి రోజు కావడంతో, రేపటి నుంచి చలాన్ల పై వున్న రుసుము యధావిధిగా వసూలు చేయడానికి రంగం సిద్ధం అవుతుంది. ఇక చివరి రోజు కావడంతో వాహనదారులు పెండింగ్ చలాన్లు వుంటే క్లియర్ చేసుకోవాలని, తద్వారా ఆఫర్ ను పొందాలని ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. ఈ ఒక్కరోజే పెండింగ్ చలాన్లు కడితే డబ్బు ఆదా అవుతుందని చెప్తున్నారు. మరోసారి పొడిగించే అవకాశం లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. తాజా ఆఫర్ తో రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం వాహనదారులు పెండింగ్ చలానాలను క్లియర్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి 250 కోట్ల రూపాయల ఆదాయం ఫైన్ల రూపంలో వచ్చింది.

త్వరపడండి.. చివరి రోజు ఆఫర్ సద్వినియోగం చేసుకోండి: ట్రాఫిక్ పోలీస్

త్వరపడండి.. చివరి రోజు ఆఫర్ సద్వినియోగం చేసుకోండి: ట్రాఫిక్ పోలీస్


టు వీలర్, త్రి వీలర్ వెహికల్ లపై 75 శాతం డిస్కౌంట్, ఫోర్ వీలర్స్ , హెవీ వెహికల్స్ పై 50% డిస్కౌంట్, కరోనా సమయంలో మాస్కులు పెట్టుకోని వారికి వేసిన ఫైన్ లలో 90 శాతం డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఆటోలపై 70 శాతం డిస్కౌంట్ తో క్లియర్ చేసుకోవాలని సూచించింది. ఇక ఈ ఆఫర్ ఈ రోజు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే రేపట్నుంచి యధావిధిగా ఫైన్ పడిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.

సక్సెస్ అయిన పోలీసుల వినూత్న ప్రయోగం

సక్సెస్ అయిన పోలీసుల వినూత్న ప్రయోగం

మొత్తానికి ట్రాఫిక్ చలాన్ ల క్లియరెన్స్ కోసం పోలీసులు చేస్తున్న వినూత్న ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చినట్టు చెప్పొచ్చు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న చలాన్లు చెల్లించకుండా ఉన్నవారు ప్రభుత్వం డిస్కౌంట్ ఇవ్వడంతో పెండింగ్ చలాన్లు చెల్లించడానికి ఆసక్తి చూపించారు. దీంతో ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చింది.

English summary
Discount offer on pending challans ends today. Traffic officials say the pending challans should be paid today, in the wake of which fines will be levied as usual from tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X