హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ నిందితులకు శిక్ష.. మరి మానస నిందితుల పరిస్థితి, ఒక్కరు కాదు నలుగురు, పేరెంట్స్

|
Google Oneindia TeluguNews

దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చింది. దీంతో వాట్ నెక్ట్స్ అనే ప్రశ్న తలెత్తుతుంది. నవంబరం 27వ తేదీన లైంగికదాడికి గురై చనిపోయిన మానస నిందితుల సంగతేంటి అని ఆమె పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. నిందితుడు ఒక్కడు కాదని, నలుగురు ఉన్నారని వారు సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశ ఘటన పూర్తవడంతో.. మానస నిందితులపై ప్రజల దృష్టి మళ్లింది.

 గుడికి వెళ్లి..

గుడికి వెళ్లి..

హన్మకొండ దీన్‌దయాళ్ కాలనీకి చెందిన మానస బర్త్ డే రోజు గుడికి వెళ్లిన మానస తిరిగిరాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆ రోజు రాత్రి విగతజీవిగా కనిపించడంతో వారు గద్గత స్వరంతో రోదించారు. తమ కూతురిది ముమ్మాటికీ హత్యేనని చెప్పారు. ఆమె లవర్ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. కేసు విచారణ జరగుతుంది. అయితే తమ కూతురిపై లైంగికదాడి చేసింది ఒక్కరు కాదు నలుగురు అని.. పేరెంట్స్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

దిశ నిందితుల మాదిరిగానే..

దిశ నిందితుల మాదిరిగానే..

దిశ ఘటన నిందితులను ఎన్‌కౌంటర్ చేసే పరిస్థితి ఏర్పడింది. మరి మానస నిందితులను సంగతి ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. నిందితులు నలుగురు అని వారు ఆరోపించడం చర్చకు దారితీసింది. నిందితుడిని ఒక్కడే అని చెప్పి పోలీసులు అబద్దం చెప్తున్నారని వారు ఆరోపించారు. ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేయాలని కోరుతున్నారు. మానసను వారు టార్చర్ పెట్టి హతమార్చారని పేర్కొన్నారు. వారిని కూడా అదేవిధంగా మట్టుబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కొత్తగా నిందితులు నలుగురు అని చెప్పడం, పోలీసులు నిజాలు దాస్తున్నారని పేర్కొనడం సందేహాలకు తావిస్తోంది.

ఫోన్ స్విచాఫ్..

ఫోన్ స్విచాఫ్..

తమ కూతురు ఇంటినుంచి వెళ్లాక ఫోన్ స్విచాఫ్ అయ్యిందని పేరెంట్స్ పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో మృతదేహం లభించడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. పుట్టినరోజు నాడే చనిపోవడం కలకలం రేపింది. కూతురు మృతదేహం లభించిన చోట బీరు సీసాలు, అమ్మాయి చెప్పులు లభించాయని గుర్తుచేశారు. ఒక్కడే కాకుండా నలుగురు లైంగికదాడి చేశారని పేరెంట్స్ చెప్తున్నారు.

ఉరే సరి

ఉరే సరి

మానస హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై కూడా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. నలుగురు నిందితులకు ఉరిశిక్ష వేయాలని కోరుతున్నారు. లేదంటే ఎన్‌కౌంటర్ చేసి.. మానస ఆత్మకు శాంతి చేకూర్చాలని విన్నవిస్తున్నారు.

English summary
what about manasa accused funishment parents ask to telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X