ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఆలోచించాలన్న ప్రధాని మోడీ!!
తెలంగాణలో మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మహబూబాబాద్ జిల్లా లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన నా ప్రియమైన కుటుంబ సభ్యులారా అని ప్రసంగాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు.
తెలంగాణను బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నాశనం చేశాయని, తెలంగాణ అంటే సాంప్రదాయానికి పెట్టింది పేరని, కానీ తెలంగాణాను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పేదల పట్ల నేరం చేశారని, బిజెపి ప్రభుత్వం వస్తే డబుల్ బెడ్రూం ఇళ్ళ స్కామ్ ను, భూమాఫియాను, ఎడ్యుకేషన్, మాఫియాను బయటపెడతామని అన్నారు.

కురవి వీరభద్ర స్వామికి వందనాలు ,తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నా అన్నారు ప్రధాని మోడీ. తెలంగాణ ప్రజలు కెసిఆర్ ను గద్దె దించాలని చూస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు అన్నారు. తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ కే గ్యారెంటీ అన్నారు.
తెలంగాణ అంటే సంస్కృతి సంప్రదాయాలు, సాంకేతిక కు పెట్టింది పేరని, కానీ కెసిఆర్ మూఢ నమ్మకంగా మార్చేశారన్నారు. బిఆర్ఎస్ కుంభకోణాలపై తెలంగాణ లో ఏర్పడే బీజేపీ సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు . కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే ,రెండు పార్టీలు కుటుంబ పార్టీలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాయన్నారు ప్రధాని మోడీ.

ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. సామాజిక న్యాయం బీజేపీ తోనే సాధ్యం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను ఆదుకోవడం లేదు . బీజేపీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అదుకుంటుంది. కరోన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి కానీ కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం ధరల నియంత్రణ చేసింది .
పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వాలు తగ్గించలేదన్నారు . తెలంగాణ లో డబల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఫార్మ్ హౌస్ సీఎం ను పంపాలి - బీసీ సీఎం ను ముఖ్యమంత్రి చేయాలన్నారు మోడీ . ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి అవసరమా మనకు.. అంటూ మోడీ ప్రశ్నించారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications