హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిఖిల్‌కు ఏమీ కాదు: 'ఎత్తు' ఆపరేషన్‌పై వివరణ ఇచ్చిన గ్లోబల్ వైద్యులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని సుచిత్రా ప్రాంతానికి చెందిన నిఖిల్ రెడ్డి అనే యువకుడికి ఎత్తు పెంచేందుకు చేసిన ఆపరేషన్‌లో అనుసరించిన విధానం సరైందేనని వైద్యులు చెబుతున్నారు. యువకుడి ఎత్తు పెంచేందుకు గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు అతడి కాళ్లను చీల్చి అతడికి ఆపరేషన్ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త పెను సంచలనాన్ని సృష్టించింది. దీంతో ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వైద్యులంతా కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎత్తు పెంచేందుకు చేసే ఆపరేషన్‌ను లింబ్ లెంథనింగ్ విత్ లింబ్ రీ కన్‌స్ట్రక్షన్ సర్జరీ అంటారని తెలిపారు.

కాసుల కోసం నిఖిల్ కాళ్లు కోశారు: ఆపరేషన్ ఇలా, సంక్లిష్ట ప్రక్రియ (పిక్చర్స్)కాసుల కోసం నిఖిల్ కాళ్లు కోశారు: ఆపరేషన్ ఇలా, సంక్లిష్ట ప్రక్రియ (పిక్చర్స్)

నిఖిల్ రెడ్డి ఎత్తు పెంచేందుకు చేసిన చికిత్సలో గానీ, అనుసరించిన విధానంలో గానీ ఎలాంటి పొరపాటు లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ సర్జరీ గురించి బాధితుడి తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్లే సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు తెలియజేయకుండా ఆపరేషన్ చేయడం వల్లనే వివాదం తలెత్తిందని పేర్కొన్నారు.

Doctors in dock over Hyderabad techie's 'height' surgery

వైద్యులు, రోగులకు మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మీడియా సహకారంతో హైదరాబాద్‌లో ఆరోగ్య రంగం ఎదిగిందని తెలిపారు. అదే విధంగా నిఖిల్ రెడ్డి విషయంలో శాస్త్ర సాంకేతిక అంశాలను మీడియాలో హైలెట్ చేయాలని కోరారు. అతడికి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రావని డాక్టర్లు హామీయిచ్చారు.

కాగా, ఎత్తు పెరగడానికి చేసిన ఆపరేషన్ అనైతికం కాదని స్పష్టం చేశారు. గురువారెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రభూషణ్, ప్రసాద్ తదితర వైద్యులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఈ ఆపరేషన్‌పై ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ లింబ్ లెంథనింగ్ శస్త్ర చికిత్స నిర్వహించాలంటే కచ్చిమైన నిబంధనలు ఏమీలేవని అన్నారు.

ఆధునిక వైద్య విధానంలో ఇలాంటి శస్త్రచికిత్సపై ఆంక్షలు ఉండవని తెలిపారు. ఎత్తు పెరగాలని అనుకుంటున్న వ్యక్తి వ్యక్తి మేజర్ అయి ఉండే ఆపరేషన్ చేయవచ్చని తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకునే వ్యక్తి తాను వ్యక్తిగతంగా సంతకం చేసినా సరిపోతుందని చెప్పారు.

ఇదిలా ఉంటే ఎత్తు పెరిగేందుకు లింబ్ లెంథనింగ్ విత్ లింబ్ రీ కన్‌స్ట్రక్షన్ సర్జరీని తన ఇష్టపూర్వకంగా చేసుకున్నట్టు గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నిఖిల్‌రెడ్డి పోలీసులకు వెల్లడించారు. తమకు సమాచారం అందించకుండా ఇంతటి పెద్ద ఆపరేషన్ ఎలా చేస్తారని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే.

అనంతరం సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో బుధవారం ఆసుపత్రికి వచ్చిన పోలీసుల బృందం నిఖిల్‌రెడ్డి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఎత్తు పెరిగేందుకు కొంతకాలంగా హాస్పిటల్ వైద్యులను సంప్రదించానని, ఆ మేరకే శస్త్రచికిత్స చేయించుకున్నట్టు తన వాంగ్మూలంలో నిఖిల్‌రెడ్డి వెల్లడించాడని సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్ స్పష్టం చేశారు.

రోగి తన ఇష్టపూర్వకంగా ఆపరేషన్ చేయించుకున్నాడని, ఇది మెడికో లీగల్ కేసు కాదు కాబట్టి ఆపరేషన్ చేశామని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయని తెలిపారు.

English summary
Taking suo motu cognizance of the controversial height gain surgery performed on a 23-year-old city-based techie Nikhil Reddy at Global Hospitals, the Telangana State Medical Council (TSMC) has summoned the doctors involved in the procedure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X