కోమటిరెడ్డీ! వద్దూ.. నీ గుట్టు విప్పాలా, రాజీవ్‌ని తిట్టలేదా: సుమన్ హెచ్చరిక
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మాజ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిల పైన టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడెక్కడ ఏం చేశారో, ఏ ప్రాజెక్టులో ఎంత తిన్నారో అన్నీ కక్కిస్తామని హెచ్చరించారు.
ఆ చిట్టాను బయటపెట్టమంటారా అని సవాల్ చేశారు. రైతుల ప్రస్తుత దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. రైతుల గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతల్లో వణుకు ప్రారంభమైందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ నేతలకు కలలో కూడా మఖ్యమంత్రి కెసిఆరే కనిపిస్తున్నారన్నారు. బోఫోర్స్ కుంభకోణం కేసులో రాజీవ్ గాంధీ పైన జైపాల్ రెడ్డి ఎన్నిసార్లు విమర్శలు చేశారో, ఎన్నిసార్లు తిట్టారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.
హైదరాబాదు లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జైపాల్ రెడ్డి అంగీకరించారని ఆరోపించారు. మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి చరిత్ర ప్రజలకు తెలుసునని మండిపడ్డారు. కోమటిరెడ్డి సోదరుల గురించి అందరికీ తెలుసునన్నారు.
బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెడితే తాము ఊరుకోమని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతులతో మాట్లాడాలని భావిస్తున్నారని, అందుకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి రావాలన్నారు. ఏ ప్రాజెక్టులో ఎవరు ఎంత తిన్నారో అంతా కక్కిస్తామని చెప్పారు. రైతుల్లో ఆత్మస్థెర్యం నింపేందుకు ప్రతిపక్షాలు కలిసి రావాలన్నారు.
కాంగ్రెస్ నేతలు అవగాహన లేమితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వామినాథన్ సిఫార్సులను కాంగ్రెస్ పట్టించుకోలేదు. బోఫోర్స్ వ్యవహారంలో రాజీవ్ గాంధీని తిట్టిన విషయం జైపాల్ రెడ్డి మరిచిపోయారా అన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలు ఎక్కడా జరగలేదన్నారు.
జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసిన చరిత్ర మీది అని ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి నీ మోసపు చరిత్ర మర్చిపోయావా? కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన అక్రమాలు బయటకు తీయమంటారా అని ప్రశ్నించారు. ప్రతీ విషయం రాజకీయం చేయడం మానుకోవాలని చెప్పారు.
ఖరీఫ్‌లో రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో కేంద్రం ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. రైతుల పట్ల బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం కిషన్‌రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications