తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల: కీలక తేదీలివే
హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు దోస్త్(DOST) నోటిఫికేషన్ విడుదలైంది. మాసబ్‌ట్యాక్‌లోని ఉన్నత విద్యా మండలిలో డిగ్రీ దోస్త్ నోటిఫికేషన్‌ను గురువారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్లు లింబాద్రి తెలిపారు.
మే 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలన్నారు. జూన్ 16న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు జూన్ 16 నుంచి 26 వరకు ఉంటాయన్నారు.

రెండో విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 16 నుంచి 27 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. జూన్ 30న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వివరించారు. మూడో విడత రిజిస్ట్రేషన్లు జులై 1 నుంచి 5 వరకు నిర్వహిస్తామని.. జులై 1 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు.
జులై 10న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. జులై 17 నుంచి డిగ్రీ మొదటి విడత సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. కాగా,
రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1060 కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేషనల్, బీకాం హానర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. . మూడు విడతల్లో డిగ్రీఅడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయనున్నారు. దోస్త్ వెబ్ సైట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications