దారుణం: బాలికపై అంబులైన్స్ డ్రైవర్ అత్యాచారం
పదేళ్ల బాలికపై ఆమె ఇంట్లోనే ఓ అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాదులోని పుప్పాలగుడాలో శుక్రవారంనాడు జరిగింది. నిందితుడిని సురేష్ అనే 22 ఏళ్ల యువకుడిగా గుర్తించారు.
హైదరాబాద్: పదేళ్ల బాలికపై ఆమె ఇంట్లోనే ఓ అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాదులోని పుప్పాలగుడాలో శుక్రవారంనాడు జరిగింది. నిందితుడిని సురేష్ అనే 22 ఏళ్ల యువకుడిగా గుర్తించారు.
ఆమనగల్‌కు చెందిన సురేష్ అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను పుప్పాలగుడాలోని తన మిత్రుడి ఇంటికి వచ్చాడు. పదేళ్ల బాలిక ఆమె ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న విషయాన్ని సురేష్ గుర్తించాడు. బాలిక తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు.

సురేష్ బాలికను ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. దాడి జరిగిన తర్వాత బాధితురాలు రోదించడం ప్రారంభించింది. ఇరుగుపొరుగువారు వచ్చి చూసి గాయపడిన విషయాన్ని గుర్తించారు. బాలిక ఇచ్చిన సమాచారంతో స్థానికులు సురేష్‌ను పట్టుకున్నారు.
అతన్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. శనివారం అతన్ని కోర్టులో ప్రవేశపెడుతారు.












Click it and Unblock the Notifications