వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా రైతుల కోసం డ్రోన్ అకాడమీ.. ఇక వ్యవసాయంలోనూ డ్రోన్ టెక్నాలజీతో దూకుడే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం కోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం త్వరలో డ్రోన్ అకాడమీని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. డ్రోన్ల ద్వారా వ్యవసాయానికి కావలసిన సహకారాన్ని అందించడానికి రెడీ అవుతోంది. రైతులకు డ్రోన్లను వ్యవసాయంలో ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్నది ఈ అకాడమీ ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వనుంది.

ఎమ్మెల్యేల ఎరకేసు: నేడు సిట్ ముందుకు న్యాయవాది శ్రీనివాస్; ఆ అకౌంట్స్ డీటెయిల్స్ ఇస్తారా?ఎమ్మెల్యేల ఎరకేసు: నేడు సిట్ ముందుకు న్యాయవాది శ్రీనివాస్; ఆ అకౌంట్స్ డీటెయిల్స్ ఇస్తారా?

తెలంగాణాలో వ్యవసాయానికి డ్రోన్ల వినియోగం

తెలంగాణాలో వ్యవసాయానికి డ్రోన్ల వినియోగం

జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయంలో సాంకేతికతను రైతులకు మరింత దగ్గరికి చేర్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలోనూ పెను మార్పులు తీసుకు వస్తోంది. ఈ క్రమంలో తాజాగా డ్రోన్ల ద్వారా రైతులు పంటలపై రసాయనాలను పిచికారి చేసేలా సరికొత్త విధానాన్ని, మరింత ఎక్కువగా రైతుల వద్దకు తీసుకువెళ్లడానికి శ్రీకారం చుట్టింది ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు డ్రోన్ల వాడకంపై క్రమంగా అవగాహన పెరుగుతుంది . ప్రతి జిల్లాలో ఇప్పటికే 15 నుండి 20 వరకు పంట క్షేత్రాలలో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

 డ్రోన్ల అకాడెమీ ఏర్పాటు చేయనున్న జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ

డ్రోన్ల అకాడెమీ ఏర్పాటు చేయనున్న జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ


ఇక డ్రోన్లను కేవలం పురుగు మందులు పిచికారీ చేయడానికి మాత్రమే కాకుండా, విత్తనాలు వేయడానికి, నానో ఎరువులు చల్లడానికి, పంట దిగుబడి అంచనా వేయడానికి ఇలా రక రకాలుగా ఉపయోగించే అవకాశం ఉంది. మనిషి వెళ్లలేని చోట కూడా డ్రోన్లు పంపించి వ్యవసాయ పనులు చేస్తే రైతులకు సమయం తో పాటుగా, పని భారం కూడా తగ్గుతుంది. ఇక డ్రోన్లతో ఉన్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం లో డ్రోన్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్టు ఈ విభాగానికి నోడల్ అధికారి గా వ్యవహరిస్తున్న కీటక శాస్త్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

డ్రోన్ అకాడమీలో రైతులకు శిక్షణ

డ్రోన్ అకాడమీలో రైతులకు శిక్షణ


డ్రోన్ అకాడమీలో డ్రోన్ల పనితీరు పై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తారు. శిక్షణ పొందిన వారికి పైలట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. ఇక ఈ సర్టిఫికెట్ వున్నవారే పంట పొలాలపై డ్రోన్లను ఎగురవేయాల్సి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ డ్రోన్ ల వాడకం పైన కూడా అనేక పరిమితులు ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించిన అనేక పనులను చేయడంలో కూలీల కొరతను అధిగమించడానికి డ్రోన్ల వినియోగం ఎంతగానో లాభం చేకూరుస్తుంది. అంతేకాకుండా డ్రోన్ లకు సంబంధించి శిక్షణ పూర్తి చేసి పైలట్ సర్టిఫికెట్ పొందిన వారికి ఉపాధి కూడా లభిస్తుంది.

డ్రోన్ల కొనుగోలుకు కిసాన్ డ్రోన్స్ పథకం

డ్రోన్ల కొనుగోలుకు కిసాన్ డ్రోన్స్ పథకం


ఇక ఐదు నుంచి పది లక్షలకు పైగా విలువ చేసే డ్రోన్ లను ఖరీదు చేయడం రైతులకు సాధ్యంకాని పని. ఒక్కొక్కరుగా రైతులు డ్రోన్లను కొనుగోలు చెయ్యలేరు. కానీ పదిమంది కలిసి సమిష్టిగా డ్రోన్ ను కొనుగోలు చేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో రైతు ఉత్పత్తి సంఘాలకు కేంద్ర ప్రభుత్వం రాయితీపై కిసాన్ డ్రోన్స్ పథకాన్ని అందిస్తుందని, రాయితీతో కూడా డ్రోన్ లను కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.

వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ కేంద్రంలో రైతులకు డ్రోన్ల శిక్షణ

వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ కేంద్రంలో రైతులకు డ్రోన్ల శిక్షణ

తాజాగా వరంగల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వ్యవసాయంలో డ్రోన్ల వాడకం గురించి రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆరేపల్లి లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లో వ్యవసాయ శాస్త్రవేత్తలుడ్రోన్ల ద్వారా పంటలపై పురుగు మందుల పిచికారీ ఏ విధంగాచెయ్యొచ్చు? ఏ విధమైనడ్రోన్లు వ్యవసాయానికి ఉపయోగపడుతాయి? అధునాతన సాంకేతిక పద్ధతులను వ్యవసాయానికి మరింత మెరుగ్గా ఎలా వినియోగించుకోవచ్చు.. వంటి అనేక విషయాలను రైతులకు ప్రత్యేక శిక్షణ ద్వారా తెలియజేశారు.ఇప్పటికే తెలంగాణ రైతాంగం వ్యవసాయంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న వేళ వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి అకాడమీని ఏర్పాటు చేసి రంగం సిద్ధం చేయడంతో వ్యవసాయ రంగంలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

English summary
Acharya Jayashankar Agricultural University to set up drone academy for Telangana farmers And with the use of drones in agriculture, there will be huge changes in agriculture in Telangana..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X