న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నుండి విదేశాలకు డ్రగ్స్; ఎడ్విన్, ప్రీతీష్ పై పీడీయాక్ట్!!

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ సర్కారు ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చాప కింద నీరులా డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు. వారి వద్ద నుండి పది కోట్ల రూపాయల విలువైన ఎనిమిది కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నుండి విదేశాలకు డ్రగ్స్

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నుండి విదేశాలకు డ్రగ్స్


కొత్త సంవత్సరం రాబోతున్న వేళ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం పెద్ద ఎత్తున ఇతర దేశాలకు డ్రగ్స్ రవాణాకు వీరు శ్రీకారం చుట్టారని పోలీసులు గుర్తించారు. ఈ ముఠా హైదరాబాద్ నుండి కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా ఎస్వోటీ పోలీసులు గుర్తించారు. ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ లపై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగించారు.

 డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ నార్కోటిక్స్

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ నార్కోటిక్స్


డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ లు గా వ్యవహరించిన ఎడ్విన్, ప్రీతీష్ నారాయణ బోర్కర్ పై పీడీ యాక్ట్ విధించారు. గత ఆగస్టు నెలలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ గోవా డ్రగ్స్ మాఫియా పై నిర్వహించిన ఆపరేషన్ లో ప్రీతీష్ నారాయణ బోర్కర్ అలియాస్ బాబు ను అరెస్ట్ చేశారు. ప్రీతీష్ నారాయణ బోర్కర్ ను విచారించడంతో డ్రగ్స్ మాఫియాకు సంబంధించి అనేక కీలక విషయాలు బయటకు వచ్చాయి. భారీ నెట్వర్క్ బయటపడింది. డ్రగ్స్ మాఫియా లో కింగ్ పిన్ ల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

 ప్రీతీష్ నారాయణ బోర్కర్ విచారణలో బయటకు డ్రగ్స్ కింగ్ పిన్ లు

ప్రీతీష్ నారాయణ బోర్కర్ విచారణలో బయటకు డ్రగ్స్ కింగ్ పిన్ లు


ప్రధానంగా ఎడ్విన్ న్యూన్స్, తుకారం సల్ గవల్కర్, వికాస్ నాయక్, రమేష్ చౌహాన్, స్టీవ్, సంజ గవల్కర్ వంటి కొంత మంది నిందితుల పేర్లు బయటకు వచ్చాయి. ఇక ప్రీతీష్ నారాయణ బోర్కర్ నెట్వర్క్ లో దాదాపు 600 మంది వినియోగదారులు ఉన్నట్టు, అందులో కొంత మంది డ్రగ్స్ విక్రయించే ఏజెంట్లుగా కూడా మారినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. దేశంలో డ్రగ్స్ మాఫియా ఎంతగా విస్తరిస్తుందో దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.

 ఎడ్విన్, ప్రీతీష్ నారాయణ బోర్కర్ పై పోలీసుల పీడీ యాక్ట్

ఎడ్విన్, ప్రీతీష్ నారాయణ బోర్కర్ పై పోలీసుల పీడీ యాక్ట్


ఇక ప్రీతీష్ నారాయణ బోర్కర్ విచారణ తరువాత రెండు నెలల పాటు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నిర్వహించిన ఆపరేషన్ లో చాలామంది డ్రగ్స్ మాఫియాని అరెస్ట్ చేశారు. వారిలో ప్రధానంగా ఎడ్విన్ కూడా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ప్రీతీష్ నారాయణ బోర్కర్, ఎడ్విన్ లపై హైదరాబాద్ పోలీసులు పిడియాక్ట్ ప్రయోగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+