డ్రగ్ రాకెట్‌లో ఇంకెవరు: గుట్టు విప్పుతున్న సినీ స్టార్స్, టాలీవుడ్‌లో చీలిక?
డ్రగ్ రాకెట్ అంశంపై టాలీవుడ్ రెండుగా చీలిందా? తమ వారి పేర్లు బయటకు రావొద్దని కొందరు భావిస్తుంటే, మరికొందరు అందరూ బయటకు రావాల్సిందే అంటున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: డ్రగ్ రాకెట్ అంశంపై టాలీవుడ్ రెండుగా చీలిందా? తమ వారి పేర్లు బయటకు రావొద్దని కొందరు భావిస్తుంటే, మరికొందరు అందరూ బయటకు రావాల్సిందే అంటున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
చదవండి: అది తెలియదన్న చార్మీ, లంచ్‌లో 'ప్రత్యేకం': రేపు ముమైత్ వంతు
ఇప్పటి వరకు సిట్ అధికారులు ఏడుగురు సినీ ప్రముఖులను విచారించారు. విచారణలో వీరు పలువురి పేర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. త్వరలో సిట్ వీరికి కూడా నోటీసులు ఇవ్వనుందని ప్రచారం సాగుతోంది.

కొందరు అలా, కొందరు ఇలా
డ్రగ్ రాకెట్‌లో సినీ పరిశ్రమను టార్గెట్ చేశారని పరిశ్రమకు చెందిన కొందరు ఆరోపిస్తున్నారు. మరోవైపు, మరికొందరు అందరినీ విచారిస్తున్నారని, కేవలం సినీ పరిశ్రమనే టార్గెట్ చేయడం లేదని, తమ పరిశ్రమలో తప్పు చేసిన వారికే ఇది వర్తిస్తుందని మరికొందరు చెబుతున్నారు. కొందరు పరిశ్రమను టార్గెట్ చేసిందంటే, ఇంకొందరు అదేమీ లేదంటున్నారు. కాబట్టి ప్రభుత్వానికి సహకరించాలని చెబుతున్నారు.
Recommended Video


కొందరు పెద్దల ఒత్తిళ్లు అంటూ..
ఇప్పటి దాకా పరిశ్రమలోని చిన్న వారినే టార్గెట్ చేశారని, పెద్ద వారి పేర్లు ఎందుకు వెలుగు చూడటం లేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వారి పేర్లు బయటకు రాకుండా రాజకీయ ఒత్తిడి వస్తోందనే ప్రచారం సాగుతోంది.

వస్తే అందరి పేర్లు
వస్తే అందరి పేర్లు బయటకు రావాలని పరిశ్రమలోని కొందరు అభిప్రాయపడుతుండగా, ఈ విషయాన్ని ఇంతటికే పరిమితం చేయాలని మరికొందరు భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. తమ వారి పేర్లు బయటకు రాకుండా కొందరు ప్రయత్నాలు చేశారని, అందుకే అందరి పేర్లు రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎవరి పేర్లు చెబుతున్నారు?
సిట్ విచారణను ఎదుర్కొన్న వారు పలువురి పేర్లు బయట పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. సిట్ అధికారులు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. విచారణలో పెద్దల పేర్లు చెబుతున్నారని, కానీ గుడ్డిగా నోటీసులు ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో విచారణను ఎదుర్కొన్న వారు ఎవరి పేర్లు చెప్పారనే చర్చ సాగుతోంది. విచారణలో సినీ స్టార్స్ కీలక విషయాలు చెబుతున్నారు.

సినీ తారల వింత వాదన
డ్రగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పలువురు తారలు తొలుత తమకు నోటీసులు అందలేదని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సిట్ వారికి ఏకంగా విచారణ తేదీని కూడా ఖరారు చేసింది. తాము ఎంతో క్లీన్ అని చెప్పిన వారు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే, వీరిలో చాలామంది నిందితులుగా కాకుండా సాక్షులుగా సిట్ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. డ్రగ్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొన్న వారు కూడా మొదట మీడియాపై ఎదురుదాడి చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications