మద్యం మత్తులో యువకుల వీరంగం: హోంగార్డు కాలు విరిగిపోయింది

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌ సమీపంలోని అల్కాపురిలో నలుగురు యువకులు మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు.

బారీకేడ్లు సైతం అడ్డుపెట్టారు. ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ యువకులు కారు వేగం పెంచి బారీకేడ్లను సైతం గుద్దేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. రోడ్డుపై ఓ గుంతలో కారు ఇరుక్కుపోవడంతో ఎటూ వెళ్లలేకపోయారు.

 Drunk and drive student hits home guard with a car in hyderabad

ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు యాదగిరిరెడ్డిపై కారు నడిపాడు. దీంతో యాదగిరికి ఓ కాలు పూర్తిగా విరిగిపోయింది. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హల్కాహాల్ పరీక్ష అనంతరం ఆసుపత్రికి తరలించారు. వారు ప్రయాణిస్తున్న కారు ఏపీ09 సీఏ 4444 కారును సీజ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+